బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. ఏప్రిల్ ఫూల్స్ వార్; కేసీఆర్‌పై బండి సంజయ్ పోస్టుతో రచ్చ!!
ఈరోజు ఏప్రిల్ ఒకటి. అందరూ ఏప్రిల్ ఒకటిని ఏప్రిల్ ఫూల్స్ డే గా జరుపుకుంటారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని బిజెపి, బీఆర్ఎస్ మధ్య ఏప్రిల్ ఫూల్ కాంటెస్ట్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేసుకుంటూ పోస్టులు పెడుతున్న తీరు జనాలకు విస్మయం కలిగిస్తుంది. తాజాగా బిఆర్ఎస్ ప్రభుత్వం పై తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇరు పార్టీల మధ్య రచ్చకు కారణంగా మారింది.
తాజాగా బండి సంజయ్ గత ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఏప్రిల్ ఫూల్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో మళ్ళీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ఇస్తామని కెసిఆర్ హామీ ఇచ్చి ఇప్పటివరకు ఆ హామీని నిలబెట్టుకోలేదని గుర్తు చేస్తూ బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా కెసిఆర్ నిరుద్యోగులను ఏప్రిల్ ఫూల్ చేశారని వ్యంగ్యంగా ఓ పోస్ట్ పెట్టారు.

సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ డబ్బులు 316 రూపాయలు అకౌంట్ లోకి వచ్చాయంటూ బండి సంజయ్ ట్విట్టర్లో సెటైర్ వేశారు. మీరు నిజంగానే నమ్మితే ఏప్రిల్ ఫూల్ అయినట్టేనంటూ పోస్ట్ పెట్టారు. ఇదిగో నిరుద్యోగి ఫోన్ కు వచ్చిన మెసేజ్ అంటూ కేసీఆర్ నవ్వుతున్న ఫోటో పెట్టి బండి సంజయ్ పెట్టిన పోస్ట్ తో బిఆర్ఎస్ నాయకులు రచ్చ మొదలు పెట్టారు. మేము కూడా తగ్గేది లేదని ఆయన పోస్టుకు రివర్స్ అటాక్ చేశారు.
Unemployed youth will be given ₹3016 allowance - CM KCR
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) April 1, 2023
If you believed that Happy April Fools Day ! pic.twitter.com/059hKD8osw
మోడీ కూడా సామాన్యుల ఖాతాలలో 15 లక్షలు వేస్తానని చెప్పారని, ఇక మోడీ కూడా 15 లక్షల రూపాయలు ఇచ్చాడని, అవి క్రెడిట్ అయ్యాయని బిఆర్ఎస్ నేతలు సైతం పోస్టులు చేస్తూ ఎదురుదాడి మొదలుపెట్టారు. నాకైతే 15 లక్షలు పంపాడు మోడీ తాత.. నీకు వచ్చాయా బండి అన్నా అంటూ ప్రశ్నిస్తున్నారు.. రాకపోతే విశ్వగురువు ఇంటి ముందు ధర్నా చేద్దాం అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక ఆ పోస్టులో మోడీ నవ్వుతున్న ఫోటో పెట్టి పోస్ట్ చేశారు. మొత్తానికి ఇరువురి మధ్య కొనసాగుతున్న ట్విట్టర్ వార్ ను చూసిన జనాలు మాత్రం అటు బిజెపి ఇటు బిఆర్ఎస్ అందరూ జనాలను ఏప్రిల్ ఫూల్స్ చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు.
నాకైతే 15 లక్షలు పంపాడు మోడీ తాత..
— Pavani Goud BRS (@PAVANIGOUD_BRS) April 1, 2023
నీకు వచ్చాయా బంటి అన్న🤣🤣
రాకపొతే విశ్వగురువు ఇంటి ముందు ధర్నా చేద్దాం🤣🤣 pic.twitter.com/LqIbY8VrAt












Click it and Unblock the Notifications