KTR: పరారీలో కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల..!

జన్వాడ ఫామ్ హౌస్ కేసులు నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేసు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే రాయదుర్గంలోని రాజ్ పాకాల, అతని సోదరుడు శైలేంద్ర పాకాల ఇంట్లో సోదాలు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు వారి అడ్డుకున్నారు. సోదాల్లో విల్లా నంబర్ 5, 40,43లో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 53 విదేశీ మద్యం బాటిళ్లను గుర్తించారు. ఈ కేసులో రాజ్ పాకాల ఏ1గా ఉండగా.. విజయ్ మద్దూరి ఏ2గా ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ మద్దూరికి పోలీసులు సీఆర్పీసీ 41 కింద నోటీసులు ఇచ్చారు.

ఫామ్ హౌస్ పట్టుబడ్డ రాజ్ పాకాలను పోలీసులు ఎందుకు వదిలేశారని అనుమానాలు వస్తున్నాయి. శనివారం రాత్రి జన్వాడ ఫౌమ్ హౌస్ లో భారీ శబ్దాలు వస్తున్నట్లు డయల్ 100 కు కాల్ వచ్చింది. దీంతో ఓ కానిస్టేబుల్ అక్కడికి వెళ్లాడు. అక్కడ భారీగా లగ్జరీ కార్లు కానిపించాయి. భారీ శబ్దాలు కూడా వచ్చినట్లు గుర్తించి వెంటనే ఉన్నతాధికారులు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఫామ్ హౌస్ దాడులు చేశారు. అక్కడ భారీగా విదేశీ మద్యంతో పాటు క్యాసిన్ ఆడుతున్నట్లుగా గుర్తించారు. పార్టీలో మహిళలు, పురుషులు ఉన్నారు. వీరంతా ప్రముఖులుగానే తెలుస్తోంది. ఇందులో పలువురు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు అనుమానించారు.

BRS Working President KTR s brother-in-law Raj Pakala is absconding

వారిని శాంపిల్స్ ఇవ్వాలని కోరారు.. కానీ మహిళలు పోలీసులను బుతులు తిట్టారు. శాంపిల్స్ ఇవ్వలేదు. దీంతో వారిని అక్కడి నుంచి పంపించారు. అయితే మహిళలను ఎందుకు వదిలేశారని.. పలువురు ప్రశ్నించారు. కాగా పురుషుల్లో విజయ్ మద్దూరి అనే వ్యక్తి పాజిటివ్ తేలింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. తనకు రాజ్ పాకాల డ్రగ్స్ ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. ఈ విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆలస్యంగా స్పందించారు. పార్టీలు చేసుకుంటే తప్పు ఏముందన్నారు. తన బామ్మర్దికి టెస్ట్ లో నెగటివ్ వచ్చిందని చెప్పారు.

అయితే తనకు రాజ్ పాకాలే డ్రగ్స్ ఇచ్చారని విజయ్ మద్దూరి చెప్పాడని.. దీనిపై కేటీఆర్ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దావాత్ అంటే మద్యం ఉంటుందని.. డ్రగ్స్ ఉండవని చెప్పారు. మీరు పార్టీలు డ్రగ్స్ చేసుకుంటూ.. మీరు దేశ ద్రోహులేనని ఆరోపించారు. అయితే ఈ ఘటనతో బీఅర్ఎస్ డిఫెన్స్ లో పడినట్లు చెప్పుకొవచ్చు. దీంతో పార్టీలో కేటీఆర్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. పార్టీ ముందుకు తీసుకెళ్లేది హరీశ్ రావేనని మాట్లాడుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+