ప్రవీణ్‌ను సీఎం చేయండి: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో మాయావతి
సూర్యాపేట: ఉత్తరప్రదేశ్ తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలోనూ బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (BSP)ని ఆదరించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి (Mayawati) రాష్ట్ర ప్రజలను కోరారు. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. బీఎస్పీనీ గెలిపించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను తెలంగాణ ముఖ్యమంత్రిని చేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
కొన్ని పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటించినా.. వాటిని అమలు చేయట్లేదని మాయావతి విమర్శించారు. అంబేద్కర్, కాన్షీరామ్ కలలను మనం సాకారం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఐపీఎస్‌ను వదిలి.. ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చారని మాయావతి తెలిపారు.

బీఎస్పీని గెలిపించి.. ప్రవీణ్‌ను ముఖ్యమంత్రిని చేయాలని మాయావతి ప్రజలను కోరారు. బీఎస్పీని దక్షిణాదిలోనూ విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు వినూత్న తీర్పు ఇస్తారని ఆశిస్తున్నట్లు మాయావతి తెలిపారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో తలపడుతూ దేశ వ్యాప్తంగా బీఎస్పీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు.
ఓబీసీ రిజర్వేషన్ల కోసం మండల్ కమిషన్ నివేదిక అమలు చేయాలని దేశ వ్యాప్తంగా ఉద్యమం చేసి.. వీపీ సింగ్ ప్రభుత్వం మెడలు వంచి ఓబీసీ రిజర్వేషన్లు సాధించిన ఘనత బీఎస్పీకే దక్కుతుందన్నారు మాయావతి. ఓబీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడంలో బీఎఎస్పీ పాత్ర కీలకమని తెలిపారు. కాగా, బీఎస్పీ ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజులే గడువు ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. బహిరంగ సభలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. బీఎస్పీ కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తోంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఎన్నికల పలితాలు వెలువడనున్నాయి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications