'సోమశిల' టూర్ వెళ్లొద్దామా..? హైదరాబాద్ కు దగ్గర్లోనే.. సూపర్ ఎంజాయ్..
ప్రస్తుత జీవనశైలి బిజీగా మారిపోయింది. వీకెండ్ దొరికితే చాలు హైదరాబాద్ వాసులు.. సిటీలోని షాపింగ్ మాల్స్, సినిమాలకు వెళ్తుంటారు. అయితే సిటీలో కాంక్రిట్ జంగిల్ తిరిగి తిరిగి బోర్ కొట్టిందా..? అయితే హైదరాబాద్ కు దగ్గరలో ప్రకృతి రమణీయమైన ప్రదేశంగా పేరుగాంచిన సోమశిలకు టూరిస్టుల తాకిడి పెరిగింది. తెలంగాణ మినీ మాల్దీవులుగా పేరుపొందిన ఈ ప్రదేశానికి నగరం నుంచి వీకెండ్స్ లో అధిక సంఖ్యలో పర్యటకులు వస్తుంటారు. నగరానికి దగ్గరగా ఉన్న నేపథ్యంలో నిత్యం పర్యటకులతో ఈ ప్రాంతం సందడిగా మారింది. మరి ఈ ప్రాంతానికి ఎలా చేరుకోవాలి..?
సోమశిల- నల్లమల అటవీ ప్రాంతం గురించి ఎంత చెప్పినా తక్కువే.. చుట్టూ పచ్చదనంతో స్వాగతం పలుకుతున్న అడవి.. ఆ మధ్యలో ఆధ్యాత్మిక ప్రాంతాలు, ఎత్తైన కొండలు.. కోనలు.. వాటి నడుమ జలపాతాలు.. ఆద్యంతం చూపరులను కనువిందు చేసేలా ఇక్కడి వాతావరణం ఉంటుంది. పర్యాటకుల తాకిడిని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టూర్ ఏర్పాటు చేసింది. ప్రతి శని, ఆదివారాల్లో ఈ టూర్ ఉంటుంది. ఈ ట్రిప్ లో భాగంగా హైదరాబాద్ నుంచి సోమశిల అందాలతోపాటుగా శ్రీశైలం దేవస్థానాన్ని కూడా దర్శించుకోవచ్చు.
ప్రయాణ వివరాల్లోకి వెళ్తే.. తొలిరోజు ఉదయం 9 గంటలకు బషీర్‌బాగ్ లోని సీఆర్ ఓ కార్యాలయం నుంచి శ్రీశైలానికి బస్సు స్టార్ట్ అవుతుంది. శ్రీశైలం చేరుకున్నాక హోటల్ లో చెకిన్ అవుతారు. అనంతరం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనం ఉంటుంది. ఆ తర్యాత శ్రీశైలం డ్యామ్ సందర్శన ఉంటుంది. రాత్రికి శ్రీశైలంలోనే బస చేయాల్సి ఉంటుంది. ఇక మరుసటి రోజు ఉదయం 9 గంటలకు శ్రీశైలం నుంచి సోమశిలకు ప్రయాణం ఉంటుంది. అయితే ఈ ప్రయాణం బోటులో ఉంటుంది. బోటు జర్నీ అత్యాద్భుతంగా ఉంటుంది. సాయంత్రం వరకు సోమశిల అందాలు చూశాక.. సాయంత్రం 5 గంటలకు సోమశిల నుంచి హైదరాబాద్ కు రావడంతో జర్నీ ముగుస్తుంది.

టికెట్ ధరల విషయానికి వస్తే.. రెండు రోజుల టూర్ లో భాగంగా పెద్దలకు రూ. 4999, పిల్లలకు 3,600గా ప్యాకేజీ ధరలు ఉంటాయి.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
'తెలంగాణ అమర్నాథ్ యాత్ర'.. నల్లమల అడవిలో అడ్వెంచర్ జర్నీ చేద్దామా..?? -
భద్రాద్రి రాముడికి మహర్దశ: ఆలయ అభివృద్ధికి రూ.351 కోట్లు విడుదల! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications