ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నివాసంలో చోరీ, కీలక పత్రాలు అపహరణ
RS Praveen Kumar: బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నివాసంలో చోరీ జరిగింది. ఆయన స్వస్థలం సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని ఇంట్లో చోరీ జరిగిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కోసిని గ్రామంలోని తన నివాసంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విలువైన పత్రాలను అపహరించారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు.
తెలంగాణలో దోపిడీ దొంగల పాలన నడుస్తుందని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. బుధవారం సిర్పూర్-కాగజ్‌నగర్ కోసిని గ్రామంలోని తన ఇంట్లో దొంగలు పడ్డారని.. కొన్ని విలువైన డాక్యుమెంట్లు దోచుకుపోయారని తెలిపారు. దీని వెనుక ఉన్న కుట్ర కోణాన్ని కూడా శోధించాల్సిందిగా డీజీపీని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు.
తెలంగాణ లో దోపిడి దొంగల పాలన నడుస్తున్నది. ఇది ముమ్మాటికీ నిజం. నిన్న సిర్పూర్-కాగజ్ నగర్ కోసిని గ్రామంలోని మా స్వగృహం లో దొంగలు పడ్డారు. కొన్ని విలువైన డాక్యుమెంట్లు దొచుకోని పోయారు.
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 31, 2024
దీని వెనక ఉన్న కుట్ర కోణాన్ని కూడా శోధించాల్సిందిగా @TelanganaDGP గారిని కోరుతున్న.
My home in… pic.twitter.com/A5ewLPMzCa

ఇది ఇలా ఉండగా, తెలంగాణ ప్రజలకు దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తెలంగాణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీరందరు మీ కుటుంబాలతో హాయిగా గడపాలని కోరుకుంటున్నాను. అయితే...
గత వారంలో మోకిల, తెలంగాణలో ఊహించని వేగంతో జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా, పండుగల సందర్భంగా ప్రజలు కింది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోమని చెప్పడం నా బాధ్యత గా భావిస్తున్న:
1. మీ బంధుమిత్రులతో భోజనం(దావత్) చేసే ప్లాను ఉంటే ఇంటి ముందు బ్రీత్ అనలైజర్లను, డ్రగ్ టూల్ కిట్లను దగ్గర ఉంచుకుంటే మంచిది. నీళ్లు బాగా తాగండి. యూరిన్ సాంపిల్స్ అవసరం పడవచ్చు.
2. మీ మ్యారేజ్ సర్టిఫికెట్, వచ్చే దోస్తుల కుటుంబాలను కూడా మారేజ్ సర్టిఫికెట్, పిల్లల బర్త్ సర్టిఫికేట్లు పదిలంగా ఉన్నయో లేదో చూసుకోమని చెప్పండి. లేకపోతే కుటుంబాలను పురుషులు-మహిళలు అనే ప్రమాదముంది.
3. తాగ మని సలహా ఇవ్వను, కాని తాగాలనుకుంటే తప్పకుండా మీ మందు సీసాలకు బిల్లులు ఉండేట్టుగా చూసుకోండి. ఎక్సైజ్ చట్టం ప్రకారం ప్రతి వ్యక్తి దగ్గరా డ్యూటీ ఫ్రీ మద్యం రెండు లీటర్లు ఉండ వచ్చు. IMFL అయితే 4.5 లీటర్లు ఉండవచ్చు. No Drunken Driving Please.
4. ప్రతి మందు పార్టీ కి పర్మిషన్ ఉండాలని మంత్రులు అంటున్నారు! కావున స్థానిక పోలీసు స్టేషన్/ఎక్సైజ్ పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వండి.
5. మీరంటే గిట్టని వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చి కుటుంబ సభ్యులు సరదాగా గడుపుతుంటే దాన్ని 'రేవ్' పార్టీ అనే ప్రమాదం ఉంది. పోలీసులు ఎక్సైజ్ అధికారులు, sniffer dogs, SOT లు 'ఒక గంటలోనే' మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి.
6. ఇంట్లో, ఇంటి చుట్టూ సీసీటీవీ కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో సరిచూసుకోండి. మీ టవర్ లొకేషన్స్ మీరే తెలుసుకోండి. లేదంటే మన హోం శాఖ సహాయ మంత్రి ఊరుకోరు.
7. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని 'బిగ్'యూట్యూబ్, మీడియా చానల్లు పండుగ భోజనాన్ని రేవ్ పార్టీ అని, మీ కుటుంబ సభ్యుల ఫోటోలతో తప్పుడు శీర్షికలతో వైరల్ చేసే ప్రమాదం ఉంది. వాళ్ల మీద పరువునష్టం దావా కు పైసలు రడీగా పెట్టుకోండి. వాళ్ల మీద యూట్యూబ్ కు రిపోర్ట్ కొట్టడం నేర్చుకోండి.
8. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ స్థానిక అధికార పార్టీ నాయకులను అడగండి. వాళ్ల దగ్గర చాలా విలువైన సమాచారం ఉంటది.
9. టపాకాయలు కాల్చేటప్పుడు చిన్న పిల్లల మీద దృష్టి పెట్టండి. చాలా గాయాలు వాళ్లకే అవుతుంటాయి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications