వ్యాపారవేత్త కిడ్నాప్: ప్రముఖ టాలీవుడ్ నిర్మాతపై కేసు
టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై జూబ్లీహిల్స్‌లో నమోదైన వ్యాపారవేత్త కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. తాజాగా ఈ కేసులో ప్రముఖ సినీ నిర్మాత, మైత్రీ మూవీస్ యజమాని యెర్నేని నవీన్ పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. తాను 2011లో క్రియా పేరుతో హెల్త్ కేర్ సర్వీస్‌ను ప్రారంభించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు వ్యాపారవేత్త చెన్నుపాటి వేణుమాధవ్. ఆంధ్రప్రదేశ్‌లో హెల్త్ కేర్ సెంటర్లు, ఖమ్మంలో టెలి మెడిసిన్, జాతీయ రహదారులపై అత్యవసర వాహనాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లో హెల్త్‌కేర్ సెంటర్ల ప్రాజెక్టు తమకు వచ్చిన సమయంలో పార్ట్ టైమ్ డైరెక్టర్లుగా సూరెడ్డి గోపాల క్రిష్ణ, రాజశేఖర్ తలశిల, ఏర్నేని నవీన్, మందాలపు రవి కుమార్‌లను నియమించుకున్నామని.. బాలాజీ అనే వ్యక్తిని సీఈవోగా నియమించినట్లు ఫిర్యాదులో వివరించారు. ఈ క్రమంలో చంద్రశేఖర్ వేగే అనే తనకు తెలిసిన వ్యక్తి తమ కంపెనీలో షేర్లు కొని డైరెక్టర్లతో కుమ్మక్కై, సంస్థ మొత్తాన్ని స్వాధీన పరుచుకునేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.

తాను ఇందుకు అంగీకరించకపోవడంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, ఎస్‌ఐ మల్లికార్జున్, మరో ఇన్స్పెక్టర్ సాయంతో కిడ్నాప్ చేయించి, డీసీపీ కార్యాలయంలో చిత్రహింసలకు గురి చేశారని వివరించారు. చంద్రశేఖర్ చెప్పినట్లుగా వినాలని, లేకుంటే చంపేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో ఆయన తెలిపారు. రూ.100 కోట్ల తన కంపెనీని అతని పేరుపై రాయించుకునే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.
అంతేగాక, మీడియాకు, ఉన్నతాధికారులకు చెప్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించినట్లు ఆయన తెలిపారు. టాస్క్ ఫోర్స్ పోలీసులకు రూ.10 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా రాధాకిషన్ రావు అరెస్ట్ వార్తలు విని ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని కోరారు. బాధితుడి ఫిర్యాదుతో నిందితులపై 386, 365, 341, 120బి రెడ్ విత్ 34, సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్ !! -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
సమంత "వావ్" వీడియో వైరల్..! -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్!












Click it and Unblock the Notifications