డ్యాన్సర్‌పై 'రేప్'యత్నం: ఫుల్లుగా తాగి, కారు మధ్యలో ఆపి!..

Subscribe to Oneindia Telugu

ఉప్పల్: దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో మహిళలకు భద్రతకు కరువవుతుండటం కలవరపెడుతోన్న అంశం. తాజాగా హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ ప్రాంతంలో ఓ డ్యాన్సర్ పై అత్యాచారయత్నం జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. సీతాఫల్ మండికి చెందిన ఓ యువతి రాత్రి 10గం. సమయంలో ఉప్పల్‌లో జరిగిన ఓ పార్టీ నుంచి వెనుదిరిగింది. రవి అనే తెలిసిన వ్యక్తి క్యాబ్‌లో ఆమె బయలుదేరగా.. మార్గమధ్యలో అతని స్నేహితులు మరో ముగ్గురు కారులో ఎక్కారు. మధ్యలో ఓ చోట బీర్ బాటిల్స్ కొనుగోలు చేసి.. ఉప్పల్ ఘట్‌కేసర్ మార్గంలోని ఓ ప్రాంతంలో మద్యం సేవించారు.

cab driver and his friends rape attempt on dancer

అనంతరం డ్యాన్సర్‌పై అత్యాచారానికి యత్నించగా.. గట్టిగా ప్రతిఘటించిన ఆమె పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. పోలీసులు వచ్చేసరికి యువతిని రోడ్డు పైనే వదిలేసి నిందితులు జారుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A dancer was complained to Uppal police regarding rape attempt on her. A cab driver and his friends were tried to rape her
Please Wait while comments are loading...