Viral video: ఈ పెళ్లి చూస్తే మైండ్ బ్లాక్ అవుతుందంతే..!
వనపర్తి: వేప చెట్టుకు రావి చెట్టుకు పెళ్లిళ్లు చేయటం గ్రామంలోని ఆలయాలలో అడపాదడపా చూస్తుంటాం అయితే వనపర్తి జిల్లా పానగల్ మండల్ కొత్తపేట గ్రామంలో మాత్రం ఆసక్తికర వివాహం చేశారు ఓ మామిడి రైతు. తన తోటలోని మామిడి చెట్లకు ఘనంగా పెళ్లి చేశాడు పెళ్లి అంటే ఏదో తూతూ మంత్రంగా చేయటం కాదు కుటుంబ సభ్యులు బంధువుల సమక్షంలో వేదమంత్రోచ్ఛరణ మధ్య శాస్త్రోక్తంగా వివాహం జరిపారు.ఆ తర్వాత విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు
మనుషులకు పెళ్లిళ్లు కావటం సర్వసాధారణం. అయితే.. మనుషులకే కాకుండా అక్కడక్కడా మూగజీవులకు చెట్లకు కూడా పెళ్లిళ్లు చేయటం అప్పుడప్పుడూ చూస్తుంటాం వింటుంటాం కూడా. కొన్ని గ్రామాల్లో అయితే ఏకంగా ఆలయాలల్లోనే రావి చెట్టుకు,వేప చెట్టుకు శాస్త్రోక్తంగా పెళ్లిళ్లు చేస్తుంటారు. ఇలా చేస్తే.. గ్రామానికి మంచి జరుగుతుందని నమ్మకం. అయితే..ఓ రైతు మాత్రం ఇదివరకెప్పుడు వినని ఆచారాన్ని పాటించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


వనపర్తిలో మామిడి చెట్లకు ఘనంగా వివాహం..!!#Wanaparthy #MangoTree #TelanganaNews #Oneindiatelugu pic.twitter.com/qbZKYLaSec
— oneindiatelugu (@oneindiatelugu) June 17, 2023
కానీ ఈ రైతులు మాత్రం శాస్త్రోక్తంగా మామిడి చెట్లకు పెళ్లిళ్లు చేసిన తర్వాతే పండ్లు కోస్తారు. అయితే చెట్ల పెళ్లే కదా అని భావించి తూతూమంత్రంగా ఈ తంతును పూర్చిచేయలేదు. తమ ముగ్గురు కుటుంబసభ్యులను, బంధువులను పిలిచి.. చెట్లను వధూవరుల్లాగా ముస్తాబు చేశారు. పూజారుల వేద మంత్రోచ్ఛారణల మధ్య కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేశారు. వేద మంత్రాల నడుమ మాంగళ్య ధారణ గావించారు. అనంతరం తలంబ్రాలు తంతును కూడా సంప్రదాయబద్ధంగా చేశారు. అంతేకాదు, ఇంటి ఆడపడుచులకు చీరే, సారెలు కూడా అందించారు. పెళ్లి అనంతరం బంధుమిత్రులు, కుటుంబసభ్యులతో కలిసి విందుభోజనాలు ఆరగించారు.












Click it and Unblock the Notifications