గంజాయి సేవించిన షణ్ముఖ్‌పై కేసు: రేప్ కేసులో సోదరుడు సంపత్ అరెస్ట్
బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ వివాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. షణ్ముక్ గంజాయి తీసుకున్నట్టు వైద్యపరీక్షల్లో తేలింది. దీంతో పోలీసులు షణ్ముఖ్‌పై కేసు నమోదు చేశారు. షణ్ముఖ్ యూరిన్ శాంపిల్ సేకరించగా.. గంజా పాజిటివ్ వచ్చింది. మరోవైపు షణ్ముఖ్ సోదరుడు సంపత్‌పై.. ఇప్పటికే చీటింగ్, అత్యాచారం కేసులు నమోదు చేశారు పోలీసులు. తర్వాత అతడ్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
షణ్ముఖ్ బ్రదర్స్‌పై సంచలన ఆరోపణలు చేశారు విశాఖపట్నంకు చెందిన మౌనిక అనే యువతి. షణ్ముఖ్ సోదరుడు సంపత్ తనను నమ్మించి మోసం చేశాడని ఆమె ఆరోపించారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనపై సంపత్ పలుమార్లు శారీరకంగా దగ్గరయ్యాడని మౌనిక తెలిపారు. అయితే, మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని తెలిసి.. సంపత్‌పై మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులో కీలక విషయాలు బయటపెట్టారు బాధితురాలు మౌనిక. ఎవరికైనా చెబితే తన పర్సనల్ ఫొటోలు వైరల్ చేస్తానని సంపత్ బెదిరించాడని ఆమె ఆరోపించారు.మౌనిక ఫిర్యాదుతో సంపత్ కోసం పోలీసులు.. నానక్‌రామ్‌గూడలోని షణ్ముఖ్ నివాసానికి వెళ్లారు. అక్కడ గంజాయి లభించాయని పోలీసులు తెలిపారు.

మత్తు పదార్థాలను సీజ్ చేశామని, మౌనిక ఫిర్యాదు మేరకు సంపత్ వినయ్ మీద చీటింగ్, మానభంగం కేసులు నమోదు చేశామని నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ తెలిపారు. 16 గ్రాముల గంజాయి లభించిన విషయంలో షణ్ముఖ్ పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. షణ్ముఖ్ గంజాయి సేవించినట్లు వైద్య పరీక్షల్లో తేలిందన్నారు.












Click it and Unblock the Notifications