వైఎస్ షర్మిలపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు: ఎందుకంటే?
హైదరాబాద్: వైయస్సార్ తెలంగాణ పార్టీ(YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో ప్రెస్‌మీట్, సోషల్ మీడియాలో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీని దూషిస్తూ మాట్లాడారని ఆ పార్టీ నేత నరేందర్ యాదవ్ మే 16వ తేదీన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బీఆర్ఎస్ పార్టీని బందిపోట్ల రాష్ట్ర సమితి అని ప్రస్తావించడంతోపాటు కేసీఆర్ పేరుపై అఫిడవిట్ తయారు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నరేందర్ యాదవ్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. షర్మిలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 505(2), 504 సెక్షన్ల కింద షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా, గతంలో వైఎస్ షర్మిల ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్‌పై చేయి చేసుకోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఆమెపై సెక్షన్ 353, 332, 509, 427 కింద కేసు నమోదు చేశారు. వాటితో పాటుగా రెడ్‌విత్ 34, 337, మరో రెండు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. పోలీసులపై చేయి చేసుకున్నారనే కేసులో అరెస్టయిన షర్మిలకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది.
అయితే ఈ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. షర్మిల తరపున వాదించిన న్యాయవాది.. నోటీసులు ఇవ్వకుండానే ఆమెను అడ్డుకున్నారని కోర్టుకు వివరించారు. హైకోర్టు చెప్పినా షర్మిలను బయటకు వెళ్లనివ్వట్లేదని తెలిపారు. షర్మిల విషయంలో పోలీసులు ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారని కోర్టులో వాదించారు.
షర్మిలను ఎస్ఐ తాకే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అంతేగాక, పోలీసులు ఆమె చేయి విరిచే ప్రయత్నం చేశారన్నారు. పోలీసులు కొట్టారు.. ఆ క్రమంలోనే షర్మిల పోలీసులు తోసేశారని తెలిపారు. పోలీసుల తరపున వాదించిన న్యాయవాది.. వైఎస్ షర్మిల పోలీసులపై చేయి చేసుకున్నారని కోర్టుకు వివరించారు.
పోలీసులపై చేయి చేసుకుంటే తప్పుడు సందేశం వెళ్తుందని అన్నారు. వేగంగా కారు పోనివ్వాలని షర్మిల డ్రైవర్‌కు సూచించారని వివరించారు. దీంతో ఆమె కారు తగిలి అక్కడున్న కానిస్టేబుల్ కాలుకు గాయమైందని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో షర్మిలకు న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆ తర్వాత బెయిల్ లభించడంతో జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు












Click it and Unblock the Notifications