Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓటుకు నోటు కేసు: తెలంగాణ ఏసీబీకి సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్‌పై ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ పూర్తయ్యేవరకు సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని జస్టిస్ గువాయ్, జస్టిస్ సూర్యకాంత ధర్మాసనం తెలంగాణ ఏసీబీని ఆదేశించింది.

నాలుగు వారాల్లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ వాయిదా వేసింది. 2015లో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో ఓటుకు నోటు కేసు వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రేవంత్ రెడ్డి సహా టీడీపీ నేతలు బేరసారాలు ఆడారనేది ప్రధాన ఆరోపణ. ఈ బేరసారాల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. మనవాళ్లు బ్రీఫ్‌డ్‌మీ అంటూ మాట్లాడినట్లు అభియోగాలున్నాయి. ఇందుకు సంబంధించి బయటికి వచ్చిన వీడియోలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఈ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి కొద్ది రోజులు జైలులో కూడా ఉన్నారు. ఆ తర్వాత కాలంలో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

 Cash for vote case: supreme court issues notice to telangana acb.

Recommended Video

    Cash For Vote : ED Chargesheet | Chandrababu కు క్లీన్‌చిట్‌ | Revanth Reddy || Oneindia Telugu

    ఇది ఇలావుండగా, మరోవైపు, ఓటుకు నోటు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నాంపల్లిలో పీఎంఎల్ఏ ప్రత్యేక న్యాయస్థానంలో గురువారం ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఎంపీ రేవంత్ రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్, ఉదయ్‌సింహ, మత్తయ్య జెరుసలేం, వేం కృష్ణకీర్తన్(వేం నరేందర్ రెడ్డి తనయుడు)పై అభియోగాలు నమోదు చేసింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు లంచంగా ఇవ్వజూపిన రూ. 50 లక్షల్ని జప్తు చేసినట్లు తెలిపింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+