సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పై రైల్వే శుభవార్త!

భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తూ ప్రగతి పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను కూడా ఆధునీకరిస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ఆధునీకరించడం మాత్రమే కాకుండా అక్కడ ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను కూడా రైల్వే శాఖ ఏర్పాటు చేయనుంది.

రైల్వే స్టేషన్ లో ఫేషియల్ రికగ్నిషన్ కెమెరా
నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నేరగాళ్లను పట్టుకునేందుకు వారి ముఖ కవళికల ఆధారంగా గుర్తించే ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను రైల్వే శాఖ ఏర్పాటు చేయనుంది. సహజంగా రైల్వే స్టేషన్లు అనేక రకాల నేరగాళ్లకు అడ్డా. ఏ నేరం చేసిన వారైనా రైల్వే స్టేషన్ల ద్వారానే పారిపోయేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఫేషియల్ రికగ్నిషన్ కెమెరా సింహస్వప్నంగా నిలుస్తుంది.

center said good news facial recognition cameras in Secunderabad railway station

ప్రయాణికులకు భరోసా ఇస్తున్న ఫేషియల్ రికగ్నిషన్ కెమెరా
దేశంలో పైలట్​ ప్రాజెక్టు కింద రైల్వే హౌరా, సెల్దా, దిల్లీ, ముంబయి, ధనపూర్​, చెన్నైలతో పాటు సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్లలను ఎంపిక చేసింది. ప్రస్తుతం రూ.720 కోట్లతో సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​ను భారతీయ రైల్వే ఆధునీకరిస్తుంది. ఈ పనుల్లో భాగంగానే ఫేషియల్​ రికగ్నిషన్​ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇది నిజంగా ప్రయాణికులకు చాలా భరోసాని ఇస్తుంది.

సికింద్రాబాద్ స్టేషన్ లో ఏర్పాటు
ఇటీవల జరిగిన కుంభమేళాలో నేరస్తులను పట్టుకునేందుకు ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేస్తే అవి కుంభమేళాలో సత్ఫలితాలను ఇచ్చాయి. దీంతో రైల్వే స్టేషన్లలో కూడా ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తే నేరస్తులకు చెక్ పెట్టవచ్చని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది.

ముఖానికి మాస్క్ పెట్టుకున్నా సరే అనుమానితులను పట్టుకునే కెమెరా
ఇదిలా ఉంటే ఇప్పటికే బెంగళూరు రైల్వే స్టేషన్లో ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాల విధానం ద్వారా 90 రోజుల వ్యవధిలో 47 మంది అనుమానితులను పట్టుకున్నారు. ఈ విధానం చాలా సమర్థవంతంగా నేరస్తులను పట్టిస్తుంది. నేరస్తులు ముఖానికి మాస్క్ ధరించినా సరే ఇట్టే ముఖ కవళికలను గుర్తించి వారిని పోలీసులకు అప్పగిస్తుంది. ఇప్పుడు ఈ విధానం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనూ అందుబాటులోకి రానుండడంతో, రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నేరాలు చేయాలంటే నేరగాళ్లకు వణుకు పుట్టాల్సిందే మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+