భారత పౌరుడు కాదు: చెన్నమనేనికి కేంద్రం షాక్, స్పందన, ఏం జరిగింది?

వేములవాడ తెరాస ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు షాక్ తగిలింది. భారత్‌లో అతని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్/ఢిల్లీ: వేములవాడ తెరాస ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు షాక్ తగిలింది. భారత్‌లో అతని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

లేఖ ద్వారా తెలిపిన హోంశాఖ

లేఖ ద్వారా తెలిపిన హోంశాఖ

ఈ విషయాన్ని ఆయనకు ఓ లేఖ ద్వారా హోంశాఖ తెలిపింది. చెన్నమనేనికి జర్మనీ పౌరసత్వం ఉన్నట్టు కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ ధ్రువీకరించడంతో భారత్‌లో ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసినట్టు పేర్కొంది. రమేశ్ పౌరసత్వం కేసు ఇటీవల సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. ఆరు నెలల్లో నిర్ణయం ప్రకటించాలని కేంద్ర హోం శాఖను సుప్రీం ఆదేశించింది. సుప్రీం ఆదేశంతో మరోమారు విచారణ జరిపిన హోం శాఖ, తుది నిర్ణయాన్ని వెల్లడించింది.

ఆది శ్రీనివాస్ ఎఫెక్ట్

ఆది శ్రీనివాస్ ఎఫెక్ట్

చెన్నమనేని పౌరసత్వంపై ఆది శ్రీనివాస్ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇప్పుడు కేంద్ర హోంశాఖ ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసింది. చెన్నమనేని రమేష్ 2014లో తెరాస తరఫున గెలిచారు.

అప్పీల్‌కు వెళ్తా

అప్పీల్‌కు వెళ్తా

తన పౌరసత్వం విషయంలో అప్పీల్‌కు వెళ్తానని చెన్నమనేని చెప్పారు. ప్రజాక్షేత్రంలో తనను ఎదుర్కోలేకే తనపై కేసులు వేశారన్నారు. అవకాశం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. కేంద్రం నిర్ణయంపై రివిజన్‌కు వెళ్తానని చెప్పారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని చెప్పారు.

ఏం జరిగిందంటే?

ఏం జరిగిందంటే?

2009 అసెంబ్లీ ఎన్నికల్లో, 2010 ఉపఎన్నికల్లో ఆయన గెలుపొందారు. రమేశ్‌ తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సమర్పించారని, ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉందని నాడు ఆయన చేతిలో ఓడిన ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు రమేశ్ ఎన్నిక చెల్లదని, ఆయన భారత పౌరుడు కాదని 2013లో తీర్పు ప్రకటించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ, చెన్నమనేని రమేశ్ సుప్రీంను ఆశ్రయించడంతో స్టే ఇచ్చింది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున వేములవాడ నుంచి ఆయన పోటీ చేసి గెలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+