బెంగళూర్‌లో ఎంఎఫ్ సెంటర్: హైదరాబాదులో యాపిల్ డెవలప్‌మెంట్ సెంటర్
హైదరాబాద్/బెంగళూరు: ఐటీ దిగ్గజం యాపిల్ బెంగళూరులో ఎంఎఫ్ సెంటర్‌ను స్థాపించనుంది. హైదరాబాదులో డెలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తోంది. దాని ప్రారంభోత్సవం రేపు (గురువారం) జరుగనుంది. ఇందులో 150 మంది పనిచేస్తారు. కెటిఆర్ చెప్పబోయే పెద్ద వార్త కూడా ఇదే.
వినూత్న మొబైల్ యాప్‌లను తయారు చేసే భారత్‌లోని డెవలపర్లకు సహకరించేలా బెంగళూరులో సెంటర్ ప్రారంభించనున్నట్టు యాపిల్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సెంటర్ కోసం ఎంత పెట్టుబడి పెట్టునున్నామన్న విషయాన్ని యాపిల్ వెల్లడింలేదు. 2017లో ఈ సెంటర్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.
భారత్‌లో స్టార్టప్ సంస్థల పుట్టినిల్లుగా ఉన్న బెంగళూరులో యాప్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ సెంటరును ప్రారంభించనున్నామని, భారత్‌లో ఇప్పటికే వేలమంది కొత్త తరం యాప్‌ల తయారీకి కృషి చేస్తున్నారని పేర్కొంది.

ఐఓఎస్ ఆపరేటింగ్ విధానంలో పని చేసేలా తయారయ్యే యాప్‌లకు ఇక్కడ పూర్తి సహాయ, సహకారాలు లభిస్తాయని యాపిల్ సంస్థ వెల్లడించింది. ఇక్కడికి వచ్చి యాప్‌లను తయారు చేసే వారికి ప్రతి వారమూ యాపిల్ నిపుణులు సలహా సూచనలు ఇస్తారని తెలిపింది.
కాగా, యాపిల్ సీఈవో టిమ్ కుక్ బుధవారం ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో పూజలు చేశారని ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. వ్యాపార సమావేశాల అనంతరం ఆయన వినాయకుడిని దర్శించుకున్నారు.
కాగా, తెలంగాణలోని హైదరాబాదులో యాపిల్ జూన్ నెలలో ఇన్నోవేషన్ కేంద్రాన్ని మొదలు పెట్టాలనుకున్న విషయం తెలిసిందే. కేటీఆర్ కూడా ఓ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు యాపిల్ డెవలప్‌మెంట్ సెంటర్ బెంగళూరులో ప్రకటించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications