తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్..?
రోజూ ప్రయాణం చేస్తున్నా చాలామందికి ట్రాఫిక్ రూల్స్ పైన సరైన అవగాహన ఉండదు. అలా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, రాంగు రూట్, రెడ్ లైట్ క్రాసింగ్, ఓవర్ స్పీడ్.. ఇలా ఒక్కో రూల్ ఒక్కో విధంగా ఉంటుంది. అయితే తెలంగాణలో ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించిన కారణంగా ట్రాఫిక్ పోలీసులు భారీగా చలాన్ లు విధిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం లక్షల సంఖ్యలో ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ క్రమంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ ఇవ్వాలని వాహనదారులు కోరుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు పెరిగిపోతున్నాయి. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా డిస్కౌంట్ స్కీమ్ ను ప్రకటిస్తారని వాహనదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ ఇటు పోలీస్ యంత్రాంగం నుంచి గానీ ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ క్రమంలో మళ్లీ పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ ఇవ్వాలని వాహనదారులు కోరుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇష్టానుసారంగా చలాన్లు విధిస్తున్నారంటూ ఇటీవల ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రూ. 100 విధించే దగ్గర రూ.1200 వరకు విధిస్తున్నారని సదరు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. అధిక జరిమానాల కారణంగా సామన్య, మధ్య తరగతి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టులో వాదించారు. ఇక ప్రస్తుతం వేల కోట్ల రూపాయల విలువైన చలాన్లు ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఇదే విషయంపై ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ ఏడాది చివరి నాటికైనా రాయితీ ప్రకటిస్తారా అని వాహనదారులు ఎదురు చూస్తున్నారు.

ఇక తెలంగాణలో అన్ని రకాల వాహనాల సంఖ్య 1.77 కోట్లు దాటింది. ఇందులో ప్రతి మూడు వాహనాల్లో రెండు మోటార్ సైకిల్లు ఉన్నాయి . అలాగే కార్లు రెండో స్థానంలో ఉన్నాయి. ప్రతి నెల దాదాపు 77,500 కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. వార్షికంగా ఇది సుమారు 9.3 లక్షల వాహనాలకు సమానంగా ఉంది. రాష్ట్రంలో 6.56 లక్షల వాహనాలు నిబంధనల మేరకు నమోదయ్యాయి. అయితే వీటిలో అత్యధికంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్నాయి.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications