పబ్‌లో మద్యం తాగిన చాందిని, ఫ్రెండ్స్: 52 మంది కోసం 13 రూంలు బుక్
ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్ హత్య కేసులో మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. చాందినీ, ఆమె స్నేహితులు ఈ నెల 2వ తేదీన విద్యార్థులు హోటల్లో నేషనల్ డిప్లమాటిక్ సమ్మిట్ కోసం విడిది చేసిన విషయం తెలిసిందే.
Recommended Video

హైదరాబాద్: ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్ హత్య కేసులో మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. చాందినీ, ఆమె స్నేహితులు ఈ నెల 2వ తేదీన విద్యార్థులు హోటల్లో నేషనల్ డిప్లమాటిక్ సమ్మిట్ కోసం విడిది చేసిన విషయం తెలిసిందే.

పబ్‌లో మద్యం సర్వ్ చేశారు
చాందిని జైన్, ఆమె స్నేహితులకు పబ్‌లో మద్యం సర్వ్ చేసినట్లుగా తెలుస్తోంది. కానీ దీనిని పట్టించుకోలేదని సమాచారం. చాందిని సహా విద్యార్థులంతా మైనర్లు. కాబట్టి వారికి మద్యం ఇస్తే చర్యలు తీసుకోవాల్సి ఉందని అంటున్నారు.

52 మంది విద్యార్థులతో కలిసి
చాందిని కనిపించడం లేదని సెప్టెంబర్ 9వ తేదీన పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు విచారణ జరిపారు. ఆ సమయంలో 52 మంది విద్యార్థులు ఓ హోటల్‌లో సమ్మిట్ కోసం అంతకుముందు కలిశారని విచారణలో తెలిసింది. వారు ఓ హోటల్లో స్టే చేయగా, సెప్టెంబర్ 2న రాత్రి మరో పబ్బుకు వెళ్లారని తెలుస్తోంది.

13 గదులు బుక్ చేసుకున్నారు
విద్యార్థుల కోసం హోటల్లో మొత్తం 13 గదులను బుక్ చేశారు. ఒక్కో గదిలో ఐదారుగురు విద్యార్థుల వరకు ఉన్నారు. అందులో ఉదయం పూట అకడమిక్ సెషన్స్ జరగగా, సాయంత్రం పూట వినోద కార్యక్రమాలు జరిగాయి.

బుక్ చేసినప్పుడు ఆ వివరాలు పరిశీలించలేదు
సెప్టెంబర్ 1వ తేదీన విద్యార్థులకు లిక్కర్ సర్వ్ చేశారు. హోటల్ బుక్ చేసుకున్న సమయంలో విద్యార్థుల వయస్సుకు సంబంధించిన వివరాలను పట్టించుకోలేదని అంటున్నారు.

హోటల్ నుంచి పబ్బుకు వెళ్లి
ఆ తర్వాత సెప్టెంబర్ 2వ తేదీన చాందినితో సహా దాదాపు 30 మంది విద్యార్థులు కలిసి జూబ్లీహిల్స్ రోడ్డులో ఉన్న ఓ పబ్‌కు వెళ్లారు. అక్కడ వారికి లిక్కర్ ఇవ్వగా, దానిని తీసుకున్నారు. చాలాసేపు అక్కడే పార్టీ చేసుకున్నారు.

ఆదేశాలు రాగానే పోలీసుల చర్యలు
గార్డియన్ లేకుండా, ఐడీ ప్రూఫ్ లేకుండా మైనర్ విద్యార్థులకు హోటల్లో గదులు అద్దెకు ఇవ్వడం సరికాదని హైదరాబాదు పోలీసులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications