కాంగ్రెస్ కోసం చంద్రబాబు సన్నిహిత నిర్మాత డబ్బులు పంపిణీ..!?
తెలంగాణలో మరి కొద్ది గంటల్లో పోలింగ్ జరగనుంది. తెలంగాణ ఓటర్లు ఎవరికి పట్టం కడతారనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సమయంలోనే అనూహ్య పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ కు టీడీపీ మద్దతు దారులు అండగా నిలుస్తున్నారు. ఇప్పుడు నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబు సన్నిహిత నిర్మాత నేరుగా డబ్బుల పంపిణీ బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం.
చివరి ప్రయత్నాలు
తెలంగాణలో గెలుపు అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి. బీజేపీతో జనసేన కలిసి ఎన్నికల బరిలోకి దిగింది. టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. ఏపీలో టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. తెలంగాణలో టీడీపీ పోటీలో లేకపోవటంతో ఆ పార్టీ మద్దతు దారులు కాంగ్రెస్ కు అండగా నిలుస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేతల ప్రచారంలో టీడీపీ శ్రేణులు పార్టీ జెండాలు, కండువాలతో పాల్గొన్నారు. టీడీపీ శ్రేణులు హైదరాబాద్ నగరంలోనూ కాంగ్రెస్ కే మద్దతు ప్రకటించారు. టీడీపీ నేతలు మద్దతు ఇస్తుంటే తీసుకోవటానికి తమకు అభ్యంతరం ఏంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

బడా నిర్మాత ఆధ్వర్యంలో
ఇక, పోలింగ్ కొన్ని గంటల్లో ఉండగా అసక్తి కర సన్నివేశాలు బయటకు వస్తున్నాయి. ఏపీ -తెలంగాణ సరిహద్దులో కాంగ్రెస్ పార్టీ కోసం ఏకంగా టాలీవుడ్ కు చెందిన బడా ప్రొడ్యూసర్ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ కు మద్దతుగా ఓటుకు భారీ మొత్తంగా పంపకాల బాధ్యతలు తీసుకున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. గత ఏడాది కాలంలో హిట్ సినిమాలను నిర్మించిన సంస్థకు ఆయన యజమానిగా ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావటంతో..కాంగ్రెస్ కు అనుకూలంగా పని చేస్తున్నారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ - బీఆర్ఎస్ - బీజేపీ మధ్య హోరా హోరీగా పోటీ నడుస్తున్న ఆ నియోజకవర్గాల్లో ఈ నిర్మాత డబ్బుల బాధ్యత తీసుకున్నట్లు చెబుతున్నారు. ఓటర్లను ఆకట్టుకోవటానికి ఒక్కో ఓటుకు పది వేల వరకు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని ప్రచారం.
మారుతున్న లెక్కలు
చంద్రబాబుకు ఆ నిర్మాత సన్నిహితుడనేది సినీ - రాజకీయ రంగంలోకి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ విజయం కోసం ఎంత ఖర్చుకు అయినా వెనుకాడకుండా ఆ నిర్మాత చివరి నిమిషంలో ముందుకు రావటం...ఎప్పటికప్పుడు పంపకాల గురించి పర్యవేక్షించటం ఇప్పుడు టాలీవుడ్ - పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనంగా మారింది. ఇటు ఏపీ..అటు తెలంగాణలో ఈ ప్రొడ్యూసర్ వ్యవహారం వైరల్ అవుతోంది. చంద్రబాబు కు సన్నిహితంగా ఉన్న ఈ నిర్మాత ఇప్పుడు ఆర్దికంగానూ కాంగ్రెస్ అభ్యర్దుల గెలుపుకు సహకరించటం ఆసక్తిగా మారుతోంది. దీంతో..ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి...తెలంగాణలో ఎన్నికల ఫలితం ఏపీ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తోందనేది ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications