నోట్ల రద్దు ఎఫెక్ట్: సంతకాలు సరిపోకుంటే.. మోత! మార్చుకోవచ్చు

చెక్కుల పైన గతంలోని సంతకాలతో పోలిస్తే ఉన్నది ఉన్నట్లుగా సంతకం లేకుంటే ఖాతాదారులకు చార్జీల మోత మోగుతుంది.

హైదరాబాద్: నోట్ల రద్దు తర్వాత చాలామంది డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉపయోగిస్తున్నారు. అలాగే చెక్కు బుక్కుల వాడకం కూడా బాగా పెరిగింది. అయితే, గతంలోని సంతకాలతో పోలిస్తే ఉన్నది ఉన్నట్లుగా సంతకం లేకుంటే ఖాతాదారులకు చార్జీల మోత మోగుతుంది. చెక్కులను బ్యాంకులు తిరిగి ఇచ్చేస్తున్నాయి.

ఏటీఎంలలో డబ్బులు ఎక్కువగా ఉండటం లేదు. దీంతో చాలామంది చెక్కులను ఉపయోగించు బ్యాంకులలో డబ్బులు తీసుకుంటున్నారు. ఎవరికి వారు తమ బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో నగదు తీసుకోవాలన్నా సంతకాలు సరిపోకుంటే చెక్కులు తిరస్కరణకు గురవుతున్నాయి.

Charges if your signature inconsistent on cheques!

ఏళ్ల క్రితం బ్యాంకులలో ఖాతాలు తెరిచిన వారి సంతకాలు మారిపోతాయి. రెగ్యులర్‌గా వెళ్ళిన వారికి ఇబ్బంది లేకపోవచ్చు. కానీ ఏళ్ల క్రితం అకౌంట్ తెరిచి, ఇప్పటి దాకా పెద్దగా సంతకం ఉపయోగపడని వారు కూడా ఇప్పుడు చెక్కులు ఉపయోగించవలసి వస్తుంది. కానీ సంతకాలు మారితే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

చార్జీలు కూడా పడుతున్నాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. చెక్కు తిరస్కరణకు గురైతే వందల్లోనే చార్జీలు ఉంటాయి. అదనంగా సర్వీసు చార్జీలు కూడా బ్యాంకులు వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, గుర్తింపు కార్డును తీసుకు వెళ్లి బ్యాంకులలో మీ కొత్త సంతకాన్ని.. అంటే మీరు ఎప్పుడు చేసేలా మార్చుకునే వెసులుబాటు ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+