హైదరాబాద్ TO బంగారం ఐలాండ్.. తక్కువ బడ్జెట్ లో.. ఎలా వెళ్లాలి..?

భారత్ కు విస్తారమైన తీర ప్రాంతం ఉంది. మనదేశంలో ఎన్నో ఐలాండ్స్ ఉన్నాయి. ప్రకృతి ఒడిలో.. సహజ సౌందర్యంతో.. స్వర్గానికి మార్గాలుగా ఇవి పర్యటకులను కట్టిపడేస్తున్నాయి. ఇక్కడి అద్భుతమైన బీచ్ లు, నేచురల్ అందాలు టూరిస్టులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. అయితే ప్రపంచంలోనే అందమైన ఐలాండ్ గా పేరుగాంచిన బంగారం ఐలాండ్.. మనదేశంలోనే ఉంది. మరి హైదరాబాద్ నుంచి ఈ ఐలాండ్ కు ఎలా చేరుకోవాలి..? ఈ ఐలాండ్ ప్రత్యేకతలు ఇక్కడ తెలుసుకుందాం..

Cheapest Way from Hyderabad to Bangaram Island in 2025 Full Breakdown

హైదరాబాద్ ప్రజలు వీకెండ్ లో చుట్టుపక్కల టూరిస్టు ప్లేస్ లను చూసి బోర్ కొట్టిందా..? అయితే ఈ బంగారం ఐలాండ్ మిమ్మల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇక్కడికి వెళ్తే మళ్లీ తిరిగి రావాలని అనిపించదు. అంతలా ఇక్కడ సహజమైన ప్రకృతి సౌందర్యం కట్టిపడేస్తుంది. ఇక్కడి బ్లూ వాటర్ బీచ్ లు, ఎత్తయిన కొబ్బరి చెట్ల గాలి.. ఇసుకలో ఆటలు.. ఒక్కటి కాదు ఎన్నో ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. చుట్టూ ఎంతో ప్రశాంతంగా.. ఎలాంటి ధ్వనులు లేకుండా ఉంటుందీ ప్రాంతం. హైదరాబాద్ రద్దీ రోడ్లు, ట్రాఫిక్, రణధ్వనులు మధ్య ఉన్నవారు సేదతీరేందుకు చక్కటి ప్రదేశంగా బంగారం ఐలాండ్ ఉంది.

ఇక ఈ బంగారం ఐలాండ్ లక్షదీప్ ద్వీప సముదాయంలో భాగంగా ఉంది. కేరళ కోస్టు నుంచి ఈ ఐలాండ్ 480 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ ప్రజలు చాలా తక్కువ మంది ఉంటారు. ఇండియాలోనే ప్రశాంతమైన ప్రదేశంగా ఈ ఐలాండ్ కు పేరుంది. ఇక్కడి సముద్రపు నీరు చాలా స్వచ్చంగా ఉంటాయి. నీటి అడుగున ఉన్న చేపలను, కోరల్ రీఫ్ లను మీరు స్పష్టంగా చూడొచ్చు. అలాగే సాహస ప్రియులు ఇక్కడ క్యూబా డైవింగ్ కూడా చేసుకోవచ్చు. మరి హైదరాబాద్ నుంచి ఈ ప్రదేశానికి ఎలా వెళ్లాలి..?

హైదరాబాద్ నుంచి ముందుగా రైలులో గానీ.. విమానంలో గానీ కేరళలోని కొచ్చి చేరుకోవాలి. కొచ్చి నుంచి అగత్తి ఐలాండ్ కు విమానంలో వెళ్లాలి. బంగారం ఐలాండ్ కు అగత్తి ఐలాండ్ సమీప ఎయిర్ పోర్ట్ గా ఉంది. ఈ విమాన టికెట్ ధర రూ. 5,300 నుంచి రూ. 15 వేల వరకు ఉంటుంది).. ఇక అగత్తి నుంచి బంగారం ఐలాండ్ కు బోట్ జర్నీ చేయాలి. ఇక్కడికి అక్టోబర్ నుంచి మార్చి మధ్యలో అధిక సంఖ్యలో పర్యటకులు వస్తుంటారు. బంగారం ఐలాండ్ కు వెళ్లే టూరిస్టులు లైట్ కాటన్ దుస్తులు, స్విమ్ వేర్, రీఫ్- సేఫ్ సన్ స్క్రీన్, హాట్ తీసుకెళ్లాలి. ఇక్కడ మొబైల్ సిగ్నల్స్ సరిగ్గా రావు. కేవలం ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్స్ మాత్రమే పనిచేస్తాయి. ఇక్కడ లాడ్జింగ్ కూడా సంతృప్తికరంగా, సింపుల్ గా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+