న్యూఇయర్ ఈవెంట్ వివాదం: బుక్‌మై షో, సన్‌బర్న్‌పై చీటింగ్ కేసు నమోదు

హైదరాబాద్: న్యూఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో 'సన్‌బర్న్' (Sunburn) పేరుతో నిర్వహించ తలపెట్టిన భారీ సంగీత కార్యక్రమంపై దుమారం కొనసాగుతోంది. ఈవెంట్‌కు సంబంధించి తాజాగా బుక్‌మై షో (BookMyShow)పై మాదాపూర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. అనుమతి తీసుకోకుండాఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించడంపై బుక్‌మై షో తోపాటు సన్న‌బర్న్ షో నిర్వాహకులపైనా కేసులు నమోదు చేశారు.

న్యూఇయర్ ఈవెంట్ల కోసం తమ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి. ఈవెంట్లలో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు.

cheating case filed on BookMyShow and Sunburn event organisers in Hyderabad

హైదరాబాద్‌లో సన్‌బర్న్ ఈవెంట్‌కు అనుమతులు రాకుండా బుక్‌ మై షో టికెట్లు విక్రయిస్తోందని సీఎం రేవంత్‌ రెడ్డి ఇటీవల మండిపడ్డారు. దీంతో పోలీసులు బుక్‌మై షో నిర్వాహకులపై ఛీటింగ్‌ కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

న్యూ ఇయర్‌ ఈవెంట్ల కోసం పోలీసుల అనుమతి తప్పని సరిగా ఉండాలని గుర్తు చేశారు. ఇలాంటి కార్యక్రమాల్లో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తే క్రిమినల్‌ కేసులు తప్పవని తేల్చిచెప్పారు. ఈవెంట్‌ నిర్వహణకు దరఖాస్తు చేసుకున్నారని, అయితే అనుమతి ఇవ్వలేదని తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్‌సిటీ సమీపంలో ఈ ఈవెంట్‌ ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ఇది ఇతర నగరాల్లో జరిగే సన్‌బర్న్‌లాంటి వేడుక కాదని, అందుకే అనుమతి నిరాకరించామని మహంతి స్పష్టం చేశారు.

కాగా, దేశంలోని అనేక రాష్ట్రాల్లో సన్‌బర్న్ ఈవెంట్లు నిర్వహిస్తుంటారు. ఈ వేడుకలో మద్యం అనుమతి ఉంటుంది. ఇదే అదనుగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయనే ఆరోపణలున్నాయి. ఈసారి నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా డిసెంబరు 31వ తేదీన మాదాపూర్‌లో సన్‌బర్న్‌ పేరుతో ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

వాస్తవానికి ఈ వేడుకను సుమంత్‌ అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈవెంట్‌ను సన్‌బర్న్‌ పేరుతో నిర్వహిస్తామని, ఇందుకు కొంత మేర చెల్లిస్తానని అతడు నిర్వాహకులతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. ఈవెంట్ నిర్వహణకు అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేసినా ఇంకా ఆమోదం లభించలేదు. అయినా బుక్‌మై షోలో టిక్కెట్లు అమ్మకానికి పెట్టడంతో అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+