సామాన్యులకు చికెన్ ధరల షాక్.. నెలరోజుల వ్యవధిలో రూ.100పెరిగిన ధర
ఇప్పటికే కోడిగుడ్లు ఆల్ టైం రికార్డు ధరలకు చేరుకోగా, ప్రస్తుతం చికెన్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేనంత పరిస్థితికి చికెన్ ధరలు చేరుకున్నాయి. మొన్న కార్తీకమాసం వరకు పెద్దగా ధరలు లేని చికెన్ ఒక్కసారిగా కార్తీకమాసం తర్వాత రేటు పెంచేసింది. చలికాలం కావడంతో ఉత్పత్తి తగ్గడంతో ఈ పరిస్థితి వచ్చిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
చికెన్ ప్రియులకు షాక్ ఇస్తున్న ధరలు
నిన్న ఆదివారం కిలో చికెన్ ఏకంగా 290రూపాయలకు చేరుకుంది. కోడిగుడ్లతో పాటు కోడి మాంసం ధరలు కూడా ఆకాశాన్ని తాకుతూ ఉండడం సామాన్యులకు షాక్ ఇస్తుంది. ముఖ్యంగా చికెన్ ప్రియులకు ఈ ధరలు షాకింగ్ అని చెప్పాలి. ప్రస్తుతం శీతాకాలంతో పాటు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న తరుణంలో ఇతర ప్రాంతాలకు చికెన్ ఎగుమతులు గణనీయంగా పెరగడం కూడా చికెన్ ధరల పెరుగుదలకు కారణమని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

బాగా తగ్గిన చికెన్ ఉత్పత్తి
కోడి దాణా ధరలు పెరగడం, చిన్న, మధ్యతరగతి పౌల్ట్రీ ఫామ్ లు నిర్వహించేవారు గిట్టుబాటు కాక పౌల్ట్రీ ఫామ్ లను మూసివేయడం వంటి అనేక కారణాలతో చికెన్ ఉత్పత్తి తగ్గింది. చలికాలం కావడంతో కూడా పెద్దగా చికెన్ ఉత్పత్తి కావడం లేదు. దీంతో ఒక్కసారిగా ధరలు ఆకాశాన్ని తాకాయి.
న్యూ ఇయర్ కు మరింత పెరగనున్న చికెన్ ధరలు
గత నెల రోజుల కింద 190 నుండి 200రూపాయలు కిలో చికెన్ ధర ఉంటే, ప్రస్తుతం ఆ ధర 290కి చేరింది. ఒక్క నెల రోజుల వ్యవధిలో వంద రూపాయలకు పైగా ధర పెరగడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తుంది. ఇక ఇప్పుడే ధరలు ఇలా ఉంటే ఇక న్యూ ఇయర్ కేజీ చికెన్ ధర 300 నుంచి 330రూపాయల వరకు ఉండే అవకాశం ఉందని చికెన్ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు.
చికెన్ తినాలంటే ఆలోచించాల్సిందే..
ఏది ఏమైనా పండగ పూట చికెన్ ముక్క తినాలన్నా కూడా సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కోడిగుడ్లు ఒక్కొక్కటి 8 రూపాయల ధర పలుకుతుంది. గుడ్ల ధరలు, చికెన్ ధరలు కొండెక్కి కూర్చున్న వేళ ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అంటున్నారు సామాన్య ప్రజలు.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం










Click it and Unblock the Notifications