అల్లు అర్జున్ ను చూసి చిరంజీవి సతీమణి సురేఖ భావోద్వేగం!
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనతో నమోదైన కేసులో అరెస్ట్ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ రావడంతో చంచల్ గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. మధ్యంతర బెయిల్ మీద విడుదలైన అల్లు అర్జున్ జైలు నుంచి ఇంటికి వెళ్లారు. దీంతో అల్లు అర్జున్ ఇంటికి సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు.
జైలు నుండి బయటకు అల్లు అర్జున్.. ఫ్యామిలీ భావోద్వేగం
జైలు నుంచి ఇంటికి రాగానే అల్లు అర్జున్ ను మొదట తన కొడుకును ప్రేమగా ఎత్తుకొని హత్తుకున్నాడు. ఆపై భార్య స్నేహ రెడ్డి అల్లు అర్జున్ ను హత్తుకుని భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం అల్లు అర్జున్ కూతురు అర్హను ఎత్తుకొని ముద్దాడారు. కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్కరిగా అల్లు అర్జున్ ను ఆలింగనం చేసుకొని భావోద్వేగానికి గురవుతున్నారు.

అల్లు అర్జున్ ను పలకరిస్తున్న సినీ ప్రముఖులు
ఇక ఇప్పటికే సినీ ప్రముఖులు పుష్ప సినిమా నిర్మాతలు అయిన నవీన్ ఎర్నేని, రవిశంకర్ అల్లు అర్జున్ ను కలిశారు. డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ ను కలిసి మాట్లాడారు. హీరో విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ ను కలిశారు. హీరో రానా దగ్గుబాటి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, డైరెక్టర్ కొరటాల శివ, నిర్మాతలు దిల్ రాజు, నాగ వంశీ వంటి ప్రముఖులు కూడా అల్లు అర్జున్ ను పరామర్శించారు
భావోద్వేగానికి లోనైన సురేఖ
ఆయనకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఓవైపు కుటుంబ సభ్యులు మరోవైపు సినీ ప్రముఖులతో అల్లు అర్జున్ నివాసం క్రిక్కిరిసి పోయింది. ఇక మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ కూడా అల్లు అర్జున్ ను కలిశారు. అల్లు అర్జున్ ని కలిసేందుకు వచ్చిన ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
కన్నీళ్లను ఆపుకుంటూ సురేఖ ఎమోషనల్
అల్లు అర్జున్ ను పట్టుకుని కన్నీళ్లను ఆపుకుంటూ బాగా ఎమోషనల్ అయ్యారు. అల్లు అర్జున్ ఆమె చేతుల్ని పట్టుకొని కూల్ చేశారు. తల మీద నిమురుతూ ముద్దు పెట్టి ఏమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని తన చర్యల ద్వారా చెప్పారు. ఇక బన్నీ జైలు నుండి బెయిల్ పై బయటకు రావటంతో ఇటు అభిమానులు కూడా బన్నీని చూడటం కోసం ఆయన ఇంటివద్దకు భారీగా చేరుకున్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications