కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

500 పడకలుగా సివిల్ ఆస్పత్రి .. పనులను పరిశీలించిన మంత్రి ఈటల

|
Google Oneindia TeluguNews

కరీంనగర్ : నగరంలోని ప్రభుత్వాసుపత్రిని ఆధునీకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కొత్త భవన నిర్మాణం చేపడుతామని పేర్కొంది. ఈ మేరకు ఇప్పుడున్న పాత ఆస్పత్రి భవనం, కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రి పనులను వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు కూడా చేశారు.

ఆధునాతన సౌకర్యాలు ..
కరీంనగర్‌లోని జిల్లా ఆస్పత్రి సివిల్ దవాఖానగా పేరు ఉంది. అయితే ఇక్కడ ఉన్న 350 పడకల భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో కొత్త భవనం నిర్మించాలని ఇదివరకే సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో కొత్త ఆస్పత్రి పనులు కూడా జరుగుతున్నాయి. పనులు జరుగుతున్న తీరును బుధవారం మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. పాత ఆస్పత్రి భవనాన్ని నిశీతంగా చెక్ చేశారు. రోగుల ఇబ్బందులు, అందుతున్న వైద్యసేవల గురించి ఆరాతీశారు.

civil hospital will be 500 beded ..!

వైద్యుల నియామిస్తాం ...
పాత ఆస్పత్రిని 150 పడకలకు కుదిస్తామని మంత్రి ఈటల పేర్కొన్నారు. కొత్త ఆస్పత్రిలో 500 పడకలని తెలిపారు. దీంతోపాటు 150 పడకల మతాశిశు కేంద్రానికి అదనంగా 100 పడకల ఆస్పత్రి భవనాన్ని నిర్మించేందుకు నిధులు విడుదల చేసినట్టు మంత్రి వెల్లడించారు. సివిల్ ఆస్పత్రికి ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి రోగులు వస్తారు. వారికి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టంచేశారు. ఈ మేరకు అవసరమైన వైద్యులను కూడా నియమిస్తామని హామీనిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి పెద్ద పీట వేస్తోందని మరోసారి స్పష్టంచేశారు మంత్రి ఈటల రాజేందర్.

English summary
The district hospital in Karimnagar is known as the Civil hospital. The 350-bed building, however, was in a dilapidated condition. CM KCR has already ordered the construction of a new building. New hospital work is also underway. The way the work is being done, Minister Rajender said on Wednesday. The old hospital building was checked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X