కాసేపట్లో హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్.. బయటకు రాకండి: ఐఎండీ వార్నింగ్!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షం కురుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల అధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారికి సలహాలు సూచనలు ఇస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రజలకు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నల్గొండ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో ఎల్లో అలెర్ట్ హెచ్చరిక జారీ చేసింది.

హైదరాబాద్ వర్షాలతో జనజీవనం అతలాకుతలం
కాగా హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే కురిసిన భారీ వర్షం కారణంగా అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రదేశాలు, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల వర్షం కారణంగా డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.
హైదరాబాద్ లో కంట్రోల్ రూమ్, ఎమర్జెన్సీ నెంబర్లు
చాలా ప్రాంతాలలో కుండపోత వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే నిన్న క్లౌడ్ బరస్ట్ జరిగినట్టుగా చెప్పిన అధికారులు పేర్కొన్నారు. ఎమర్జెన్సీ నంబర్లను కూడా ఇచ్చి ప్రజలకు సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇక హైదరాబాద్ కలెక్టర్ హరి చందన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు, టోల్ ఫ్రీ నంబర్ లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
మరికాసేపట్లో హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్.. అలెర్ట్
క్లౌడ్ బరస్ట్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక తాజాగా మరో మారు వాతావరణ శాఖ కీలక హెచ్చరికను జారీ చేసింది. మరికొద్ది గంటల్లో హైదరాబాద్ సిటీలో క్లౌడ్ బరస్ట్ జరగనుందని పేర్కొంది. ప్రజలెవరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దు అని సూచించింది. క్లౌడ్ బరస్ట్ నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఇస్తున్న సూచనలు పాటిస్తూ, ఏదైనా ఇబ్బంది ఎదురైతే కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications