Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్వచ్ఛలో కేసీఆర్: హైదరాబాద్‌ను అందంగా(ఫోటోలు)

హైదరాబాద్: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడంతోపాటు 300 ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న హైదాబాద్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ బుధవారం ఒక బృహత్తర ప్రణాళికను ప్రకటించారు. స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్‌పై బుధవారం హెచ్‌ఐసిసిలో సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్న సమావేశంలో హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికను సీఎం కేసీఆర్ వివరించారు. సహజంగా మనుషులు మార్పుకు అంత సులభంగా ఒప్పుకోరని, కానీ కొత్తగా ఆలోచించే వారు మార్పుకు అంగీకరిస్తారని సీఎం అన్నారు.

 స్వచ్ఛలో కేసీఆర్: హైదరాబాద్‌ను అందంగా

స్వచ్ఛలో కేసీఆర్: హైదరాబాద్‌ను అందంగా


200 ఏళ్ల క్రితమే పరిశ్రమలు వచ్చాయి, హైదరాబాద్‌కు అనేక హంగులు, అవకాశాలు ఉన్నాయి, తెలంగాణకు అద్భుతమైన పారిశ్రామిక విధానం ఉందన్నారు. అంబానీలాంటి పారిశ్రామిక వేత్తలు దీనిని మెచ్చుకున్నారని, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, మన పిల్లలకు మంచి ఉపాధి దొరుకుందని, అందుకోసం హైదరాబాద్‌ను సిద్ధం చేయాలన్నారు.

స్వచ్ఛలో కేసీఆర్: హైదరాబాద్‌ను అందంగా

స్వచ్ఛలో కేసీఆర్: హైదరాబాద్‌ను అందంగా


హైదరాబాద్‌ను పరిశుభ్రంగా మార్చుకుందాం, నగరాన్ని నాలుగు వందల ముక్కలుగా మారుద్దామన్నారు. గవర్నర్, ముఖ్యమంత్రి, మంథ్రులు, స్పీకర్, మండలి చైర్మన్, ముఖ్య అధికారులు తలా ఓ ముక్క బాధ్యత తీసుకుంటారన్నారు. మనందరం కలిసి పని చేస్తే ఏదైనా సాధ్యమేనని అన్నారు.

స్వచ్ఛలో కేసీఆర్: హైదరాబాద్‌ను అందంగా

స్వచ్ఛలో కేసీఆర్: హైదరాబాద్‌ను అందంగా


600 కిలో మీటర్ల చదరపు విస్తీర్ణంలో ఉన్న నగరంలో ఒక్కొక్క టీమ్‌కు ఒకటిన్నర కిలో మీటర్ల విస్తీర్ణం వస్తుందని, 35,833 మంది ఇందులో భాగస్వాములు అవుతారని తెలిపారు. ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేద్దాం, దీనికి సంబంధించి ఈనెల 16 నుంచి కార్యరంగంలోకి దిగుదామన్నారు.

స్వచ్ఛలో కేసీఆర్: హైదరాబాద్‌ను అందంగా

స్వచ్ఛలో కేసీఆర్: హైదరాబాద్‌ను అందంగా

ఆయా ప్రాంతాల్లో స్వచ్ఛందంగా ముందకు వచ్చే వారి వివరాలు తీసుకోవాలని చెప్పారు. డాక్టర్లు, ఇంజనీర్లు, సెలబ్రిటీలు, లాయర్లతో పాటు వేదిక, ప్రాంగణం వివరాలు తీసుకోవాలని చెప్పారు. ఈనెల 16 నుంచి 20 వరకు బృందాలు బస్తీల్లో తిరుగుతాయి, చెత్త ఎత్తివేయడానికి అవసరమైన సామాగ్రి, వాహనాలు జిహెచ్‌ఎంసి సమకూరుస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.
స్వచ్ఛలో కేసీఆర్: హైదరాబాద్‌ను అందంగా

స్వచ్ఛలో కేసీఆర్: హైదరాబాద్‌ను అందంగా

బస్తీలను బాగా చూసుకునే బాధ్యత బస్తీవాసులే నిర్వహించే విధంగా వారిని సిద్ధం చేద్దామన్నారు. ప్రజల్లో వంద శాతం మంచి ఉంటుంది, దాన్ని తట్టిలేపే వాళ్లు కావాలన్నారు. స్వచ్ఛమైన హైదరాబాద్, శాంతియుతమైన హైదరాబాద్ కావాలి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి, అప్పుడే మనకు వృత్తిపరమైన సంతృప్తి ఉంటుందన్నారు.

స్వచ్ఛలో కేసీఆర్: హైదరాబాద్‌ను అందంగా

స్వచ్ఛలో కేసీఆర్: హైదరాబాద్‌ను అందంగా

బలహీన వర్గాలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఆలోచన చేశానని, ఐడిహెచ్ కాలనీని మొన్ననే చూశాను, అక్కడి ప్రజలు చాలా సంతోష పడ్డారని అన్నారు. హైదరాబాద్‌లో రెండు లక్షల మందికి 3-4 ఏళ్లలో దశల వారిగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించనున్నట్టు ఆయనే చెప్పారు.
స్వచ్ఛలో కేసీఆర్: హైదరాబాద్‌ను అందంగా

స్వచ్ఛలో కేసీఆర్: హైదరాబాద్‌ను అందంగా


హెచ్‌ఎండిఏ పరిధిలో ప్రతి పనిని ఒక ప్రణాళికా బద్ధంగా చేసుకుందామని , బృందాలు బస్తీలకు వెళ్లే సందర్భంగా స్థానిక అవసరాల కోసం 50 లక్షల రూపాయల వరకు ఒక్కో చోట ఖర్చు పెట్టవచ్చునని, దీనికి రెండు వందల కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు.

స్వచ్ఛలో కేసీఆర్: హైదరాబాద్‌ను అందంగా

స్వచ్ఛలో కేసీఆర్: హైదరాబాద్‌ను అందంగా


బస్తీల్లో 15 మందితో ఒక కమిటీ వేసుకోవాలని, అలా ఆరువేల మంది ఛేంజ్ ఏజెంట్స్‌ను తయారు చేసుకుంటామని, దీనిలో 50 శాతం మంది మహిళలు ఉండాలని అన్నారు. జూలైలో హరిత హారం ప్రారంభం అవుతుందని, నగరంలో మూడు కోట్ల మొక్కలు నాటనున్నట్టు చెప్పారు. విప్రో చైర్మన్ అజిత్ ప్రేమ్‌జీని ఇటీవల కలిశాను, బెంగళూరులో పరిస్థితి బాగాలేదు, హైదరాబాద్‌లో మా సంస్థను విస్తరిస్తున్నాం అని చెప్పారని కెసిఆర్ తెలిపారు.

 స్వచ్ఛలో కేసీఆర్: హైదరాబాద్‌ను అందంగా

స్వచ్ఛలో కేసీఆర్: హైదరాబాద్‌ను అందంగా


బెంగళూరులో ట్రాఫిక్ పరిస్థితి బాగా లేదు, హైదరాబాద్ అలా కావద్దని చూస్తున్నాం, 20వేల కోట్లతో త్వరలో సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ సిస్టమ్ తయారు చేస్తాం అని చెప్పారు. రాబోయే మూడేళ్లలో మార్పు కనిపిస్తుందని అన్నారు. 300 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ ప్రత్యేకతను నిలబెట్టుకోవాలన్నారు.

 స్వచ్ఛలో కేసీఆర్: హైదరాబాద్‌ను అందంగా

స్వచ్ఛలో కేసీఆర్: హైదరాబాద్‌ను అందంగా


నగరంలోని ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టలు ప్రభుత్వమే అందిస్తుందని, తడి, పొడి చెత్తను వేరుగా సేకరించాలని అన్నారు. బస్తీవాసులు, టీమ్ సభ్యులకు టీ షర్ట్స్, టోపీలు సమకూరుస్తామని చెప్పారు. త్వరలోనే పత్రికలు, చానళ్ల ప్రతినిధులతో సమావేశం అవుతామని, మీడియా సంస్థలు ప్రచారం నిర్వహించాలని కోరనున్నట్టు చెప్పారు.

స్వచ్ఛలో కేసీఆర్: హైదరాబాద్‌ను అందంగా

స్వచ్ఛలో కేసీఆర్: హైదరాబాద్‌ను అందంగా


ఆరువేల మంది ఛేంజ్ ఏజెంట్స్ నెంబర్లు సేకరించి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కోసం మోబైల్ ఆప్‌ను రూపొందించామని, ఫేస్‌బుక్, వాట్సప్‌లో కూడా సమాచారం ఇవ్వాలని కోరారు.

 స్వచ్ఛలో కేసీఆర్: హైదరాబాద్‌ను అందంగా

స్వచ్ఛలో కేసీఆర్: హైదరాబాద్‌ను అందంగా


పెన్షన్ లాంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందని అర్హులు ఉంటే వారి వివరాలు సేకరించాలని, ఇళ్లు లేని పేదలను గుర్తించాలని అన్నారు. బస్తీల్లో ధనవంతులను ప్రోత్సహించి వారి ద్వారా సిసి కెమెరాలు ఏర్పాటు చేయించాలని చెప్పారు.

 స్వచ్ఛలో కేసీఆర్: హైదరాబాద్‌ను అందంగా

స్వచ్ఛలో కేసీఆర్: హైదరాబాద్‌ను అందంగా

నగరంలోని చెరువుల్లో మురుగు నీరు కలిసే ప్రాంతాలను గుర్తించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అందరం కలిసి సమిష్టిగా కృషి చేసి హైదరాబాద్‌ను అందమైన నగరంగా తీర్చిదిద్దుకుందామని అన్నారు. హైదరాబాద్‌ను నాలుగు 400 విభాగాలుగా విభిజంచగా, వాటికి మంత్రులు, ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు, ఇతర ముఖ్య అధికారులు ఒక్కో భాగానికి ఇన్‌చార్జ్‌లుగా ఉన్నారు.

ప్రస్తుతం అనాగరిక జీవితం గడుపుతున్నాం, కలుషిత ఆహారం, కలుషిత నీరు వాడుతున్నాం, దీన్నుంచి మనం విముక్తి కావాలని, అందరం అనుకుంటే మార్పు సాధ్యమేనని చెప్పారు. దానికి తెలంగాణ రాష్ట్రమే ఉదాహరణ. నా జీవితంలో నాకే సంభవించిందని చెప్పారు.

నిజానికి తెలంగాణ ఉద్యమానికి బయలుదేరినప్పుడు నేను ఒక్కడినే ఉన్నా, పక్కన పదిమంది కూడా లేరు. ఉద్యమం ప్రారంభించినా, తెలంగాణ రాష్ట్రం కల సాకారమైంది. హైదరాబాద్ లేని తెలంగాణ కావాలనుకుంటే ఎప్పుడో ఏడేళ్ల క్రితమే వచ్చేదని, కానీ తెలంగాణ ప్రజల రక్తంతో నిర్మించిన హైదరాబాద్‌ను వదులుకోమని చెప్పినా అని అన్నారు. హైదరాబాద్‌కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+