• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆర్టీసీ సమ్మెపై సర్కార్ ఉక్కుపాదం.. మూడురోజుల్లో అదుపులో రావాలన్న సీఎం..భగ్గుమన్న ప్రతిపక్షాలు

|

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె తాజా పరిణామాలపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. మూడు రోజుల్లో సాధారణ పరిస్థితులు తీసుకురావాలని, ప్రజా రవాణా వ్యవస్థను త్వరితగతిన పునరుద్దరించాలని ముఖ్యమంత్రి చంద్రశేకర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వడా అజయ్, ఆర్టీసీ అధికారులు హాజరైయ్యారు. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ పై నివేదికను చంద్రశేఖర్ రావు కోరడంతో అధికారులు నివేదికను అందజేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కూడా చర్చజరిగినట్టు తెలుస్తోంది. అన్ని చోట్ల సిసి కెమెరాలు పెట్టాలని, మహిళా పోలీసులను కూడా బందోబస్తు కోసం వినియోగించుకోవాలని చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేసారు.

ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారు.. ఉద్యోగసంఘాలపై మండిపడ్డ పువ్వాడ అజయ్..

ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారు.. ఉద్యోగసంఘాలపై మండిపడ్డ పువ్వాడ అజయ్..

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను ఉద్దేశించి రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమ్మెపై ప్రభుత్వం తన విదానాన్ని నాలుగో తారీకునే చెప్పిందని, అయినా తమ ఎన్నికల మానిఫెస్టోలో ఎక్కడా కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పలేదన్నారు. చర్చల నుండి అర్థాంతరంగా వెళ్లిపోయింది కార్మిక సంఘాల నాయకులేనన్నారు. కార్మిక సంఘాలను అడ్డుపెట్టుకుని మాట్లాడుతున్న ప్రతిపక్షాలు, ప్రజలకు ఇబ్బందులను గురిచేసే చర్యలను సమర్దిస్తరా అంటూ ప్రశ్నించారు.

 నిరుద్యోగ సమస్య తీర్చలేక పోయారు.. కేసీఆర్ పై మండిపడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి..

నిరుద్యోగ సమస్య తీర్చలేక పోయారు.. కేసీఆర్ పై మండిపడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి..

తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీర్చడంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పూర్తిగా విఫలం అయ్యాడని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ అన్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగి పోయిందని, ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన చంద్రశేఖర్ రావు, ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ వచ్చిన సమయంలో రాష్ట్రంలో 12 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఇప్ప్పుడు 24 లక్షల మంది ఉన్నారని అన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కాకపోగా రెట్టింపు అయ్యిందన్నారు. అధికార పార్టీ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది అనేది తప్పుడు వాదన అన్నారు.

ఆర్టీసీ పై ప్రగతిభవన్ ని ముట్టడిస్తాం.. కార్మికులకు న్యాయం జరగాలన్న లక్ష్మణ్

ఆర్టీసీ పై ప్రగతిభవన్ ని ముట్టడిస్తాం.. కార్మికులకు న్యాయం జరగాలన్న లక్ష్మణ్

ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మన్ హెచ్చిరించారు. ఇన్ని రోజులుగా కార్మికుల సమస్యలు పరిష్కరించని ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కులేదన్నారు. బీజేపీ ఆర్టీసి కార్మికుల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగేవరకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించిక పోతే చంద్రశేఖర్ రావు పాలనను స్థంభింప చేస్తామని హెచ్చిరించారు. కార్మికుల న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించకుండా సమస్యను చంద్రశేఖర్ రావు జఠిలం చేస్తున్నారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఖమ్మంలో ఆర్టీసి డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.. పరిస్ధితి విషమం..

ఖమ్మంలో ఆర్టీసి డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.. పరిస్ధితి విషమం..

తమ సమస్యలు పరిష్కరించాలంటూ తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు సమ్మె చేపట్టినప్పటికీ ప్రభుత్వం దిగిరాక పోవడంతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మెను మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. ఈ నెల 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై వంటావార్పు, 14న బహిరంగ సభలు, 15న రాస్తారోకోలు, 16న ర్యాలీలు, 17న ధూంధాం, 18న బైక్ ర్యాలీలు చేపట్టాలని నిశ్చయించారు. అంతేకాకుండా, ఈ నెల 19న తెలంగాణ బంద్ కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా ఖమ్మంలో ఆర్టీసి డ్రైవర్ గా పని చేస్తున్న శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఒంటినై కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకున్నారు. 90శాతం కాలిన గాయాలతో హాస్పత్రిలో చేరిన శ్రీనివాస రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీనివాస రెడ్డికి జరక్కూడనిది ఏదైనా జరిగితే పరిస్ధితి దారుణంగా తయారయ్యే పరిణామాలు కనిపిస్తున్నాయి.

English summary
Chief Minister Chandrashekhar Rao held a press conference at Pragati Bhavan on the latest developments in the RTC strike. Chief Minister Chandrasekar Rao ordered officials to bring general conditions in three days and rapidly reconcile public transport system. The meeting was attended by the Transport Minister Puvvada Ajay and the RTC officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more