మంత్రులకు రేవంత్ బిగ్ టాస్క్, కొత్త టెన్షన్..!!
ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు ఇప్పుడు కాంగ్రెస్ కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. సీటు నిలబెట్టుకొనేందుకు బీఆర్ఎస్ కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. అటు బీజేపీ నేతలు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ ఎన్నిక వేళ సర్వే నివేదికలతో రేవంత్ తానే ప్రచారంలోకి దిగాలని డిసైడ్ అయ్యారు. కాగా.. మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు. బిగ్ టాస్క్ ఫిక్స్ చేసారు. ఈ నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది.
జూబ్లీహిల్స్ లో ఇప్పుడు పోరు హోరా హోరీగా మారుతోంది. మూడు ప్రధాన పార్టీలు గెలుపు పైన ఫోకస్ చేసాయి. ఎప్పటికప్పుడు గ్రౌండ్ రిపోర్ట్స్ తెప్పించుకుంటూ.. అవసరమైన మార్పులను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. తాజాగా సీఎం రేవంత్. కాంగ్రెస్ పార్టీ నేతలతో జూబ్లీహిల్స్ బై పోల్ పైన కీలక భేటీ నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి పొరపాటు లేకుండా ప్రతీ డివిజన్.. ప్రతీ ఇంటికి వెళ్లి ప్రచారం చేసే విధంగా మంత్రులను రంగంలోకి దించారు. ఈ మేరకు డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. ఒక్కో డివిజన్ కు ఇద్దరు మంత్రులను బాధ్యులను చేసారు. అందులో భాగంగా యూసఫ్ గూడా కు ఉత్తమ్, పొన్నంకు బాధ్యతలు కేటాయించారు.

షేక్ పేట- వివేక, కొండా సురేఖ.. రహ్మత్ నగర్ - కోమటిరెడ్డి, పొంగులేటి.. సోమాజీగూడ- శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఎర్రగడ్డ- దామోదర్ రాజనర్సింహ, జూపల్లి.. వెంగళరావు నగర్ - తుమ్మల, వాకిటి శ్రీహరి.. బోరుబండ - సీతక్క, ఎంపీ మల్లురవిని బరిలోకి దించారు. అదే విధంగా పలు కార్పోరేషన్ల ఛైర్మన్లు ప్రచారం నిర్వహిస్తున్నారు. రేవంత్ సైతం రోడ్ షోల్లో పాల్గొననున్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలన తరువాత గ్రేటర్ పరిధిలో జరుగుతున్న ఎన్నిక కావటంతో గెలిచి తమ బలం నిరూపించుకోవాలని రేవంత్ భావిస్తున్నారు. అదే విధంగా మంత్రులకు తమకు కేటాయింపు చేసిన డివిజన్లలో మెజార్టీ బాధ్యతలు అప్పగించటంతో వారిలో టెన్షన్ పెరుగుతోంది. మంత్రులకు అప్పగించిన టాస్క్ ఆధారంగా వారిపైన భవిష్యత్ నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని పార్టీ నేత ల సమాచారం. జూబ్లీహిల్స్ తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు..గ్రేటర్ ఎన్నికలు ఉండటంతో ఇప్పుడు రేవంత్ టీం ఇక్కడ ఎలాంటి ఫలితం సాధిస్తుందనేది ఉత్కంఠగా మారుతోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications