SLBC tunnel: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పరిశీలించిన సీఎం రేవంత్
SLBC tunnel: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదస్థలిని పరిశీలించారు. మంత్రుల బృందంతో కలిసి ఎస్ఎల్‌బీసీ సొరంగంలోకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. సహాయక చర్యల గురించి నిపుణులను అడిగి తెలుసుకున్నారు.
టన్నెల్ పరిశీలన అనంతరం వివిధ శాఖల అధికారులతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. అధికారులు ప్రమాద స్థలం వద్ద నెలకొన్న పరిస్థితుల గురించి ముఖ్యమంత్రికి వివరించారు. సీఎం రేవంత్ వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తదితరులు ఉన్నారు.

టన్నెల్‌లో 14 కిలోమీటర్ వద్ద జరిగిన ప్రమాదంలో 8 మంది సిబ్బంది చిక్కుకున్న విషయం తెలిసిందే. వారంతా మరణించినట్లు భావిస్తున్నారు. అయితే, వారిని తీసుకొచ్చేందుకు పరిస్థితులు అనుకూలంచకపోవడంతో ఆ ప్రక్రియ ఆలస్యమవుతోంది. నీరు ఊటగా వస్తుందని, బురద కూడా బాగా ఉందని సహాయక సిబ్బంది చెబుతున్నారు.
live: Hon'ble Chief Minister Sri.A.Revanth Reddy participates in Visit & Review on SLBC Tunnel Accident at Domalapenta in Nagarkurnool District. https://t.co/mJt5ciyHfj
— Telangana CMO (@TelanganaCMO) March 2, 2025
నీటి ఊట
రెస్క్యూ ఆపరేషన్‌కు నీటి ఊట ఆటంకంగా మారడంతో.. ఆ నీటి ఊట ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకునేందుకు జియోలాజికల్ టీమ్ సర్వే చేస్తోంది. టన్నెల్‌పై భాగమైన అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో జియోలాజికల్ అధికారులు సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ప్రమాద స్థలం పైభాగంలో 450 మీటర్ల లోతున నీటి పొరలు ఉన్నట్లు గుర్తించారు. స్థానికంగా ఉసురువాగు, మల్లెలవాగు, రామతీర్థం, మల్లెలతీర్థం వాగుల నీరు పవహిస్తుంటుంది. ఈ వాగుల్లోని మల్లెలతీర్థం నుంచి వచ్చే నీటి ప్రవాహం పారుతున్నట్లు అధికారులు గుర్తించారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications