రేవంత్ మంత్రివర్గం లోకి నవీన్ యాదవ్, హైకమాండ్ గ్రీన్ సిగ్నల్...!?

ముఖ్యమంత్రి రేవంత్ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఫలితం తరువాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల పైన ఫోకస్ చేసారు. ఈ నెల 17న జరిగే మంత్రివర్గ భేటీలో ఈ ఎన్నికల పైన నిర్ణయం తీసుకోనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల దిశగానూ కసరత్తు చేస్తున్న రేవంత్.. కొత్త నిర్ణయాలకు సిద్దమయ్యారు. సామాజిక సమీకరణాలు.. గ్రేటర్ లో బలాబలాలను పరిగణలోకి తీసుకుంటూ మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారు. ఈ మేరకు హైకమాండ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక్కడ అమలు చేసిన వ్యూహాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గెలవాలని రేవంత్ భావిస్తున్నారు. ఈ నెల 17న జరిగే మంత్రివర్గ భేటీలో స్థానిక ఎన్నికల పైన నిర్ణయం తీసుకోనున్నారు. డిసెంబర్ లోనే ఎన్నికలు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఆ తరువాత గ్రేటర్ ఎన్నికలు రేవంత్ సమర్దతకు పరీక్షగా మారనున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రేటర్ పరిధిలో ఒక్క సీటు గెలవలేదు.

CM revanth Likely to induct Naveen Yadav in his cabinet as latest equations

ఆ తరువాత జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ బై పోల్స్ లో విజయం సాధించింది. ఇక.. గ్రేటర్ పరిధిలో విజయం రేవంత్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే రేవంత్ కేబినెట్ విస్తరణ చేయాలని... ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు స్థానాల్లో ఒకటి తాజాగా జూబ్లీహిల్స్ నుంచి గెలిచిన నవీన్ యాదవ్ కు కేటాయించాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

గ్రేటర్ పరిధిలో బీసీ సామాజిక లెక్కలు కీలకంగా మారుతున్నాయి. నవీన్ యాదవ్ కు బీసీ కార్డు తో పాటుగా ఎంఐఎం తో సత్సంబంధాలు కలిసి వచ్చే అంశం. కొద్ది రోజుల క్రితం వరకు హైదరాబాద్ కు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఇటీవల మహమ్మద్ అజారుద్దీన్‌కు పదవి ఇచ్చినా.. బీజేపీ నినాదం తమకు సమస్యగా మారకూడదని రేవంత్ భావిస్తున్నారు. అందులో భాగంగా గ్రేటర్ పరిధి లో గెలుపు ఓటముల పై ప్రభావం చూపే యాదవ వర్గానికి కేబినెట్ లో అవకాశం ఇవ్వాలని రేవంత్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దాదాపుగా ప్రతీ నియోజకవర్గంలో యాదవ వర్గం ఓట్లు ఉన్నాయి.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తలసాని గ్రేటర్ నుంచే మంత్రిగా పని చేసారు. దీంతో..ఇప్పుడు నవీన్ కు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వటం ద్వారా గ్రేటర్ కు మంత్రి పదవి.. బీసీ సమీకరణం కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. జూబ్లీహిల్స్ లో రేవంత్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన హైకమాండ్.. ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపటం లాంఛనమే. దీంతో, త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరిగే ఛాన్స్ ఉందని పార్టీ నేతల సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+