కేసీఆర్, హరీశ్ ను జైలులో పెట్టిన తర్వాతే - రేవంత్ సంచలనం..!!

ముఖ్యమంత్రి రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. బీజేపీ చేసిన విమర్శలను సీఎం రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై 48 గంటల్లోగా విచారణ చేస్తారని సీబీఐకి అప్పగి స్తే ఇంకా చర్యలు లేవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అవినీతికి పాల్పడిన కేసీఆర్, హరీశ్ రావును జైలు లో పెట్టిన తర్వాతే మాట్లాడాలని బీజేపీ నేతలకు రేవంత్ తేల్చి చెప్పారు.

తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు - సీఎం రేవంత్ మధ్య మాటల యుద్దం కొనసాగింది. ఆ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల దోపిడీ జరిగిందని గతంలో అమిత్ షా చెప్పారని, ఆ అవినీతిపై విచారణ జరగాలని అన్నారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. సీబీఐకి బదిలీ చేస్తే 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేస్తామని కిషన్ రెడ్డి అన్నారని, వారి మాటలు నమ్మి కేసును సీబీఐకి అప్పగించామని, ఇప్పటి వరకు చర్యలు లేవని సీఎం విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒకటై ఓట్లు, సీట్లు పంచుకున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అవినీతికి పాల్పడిన కేసీఆర్, హరీశ్ రావును జైలు లో పెట్టిన తర్వాతే మాట్లాడాలని బీజేపీ నేతలకు సూచించారు. కేసీఆర్, హరీశ్ రావుపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీఎం ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై దర్యాప్తును ముందుకు సాగనివ్వడం లేదని వ్యాఖ్యానించారు. కేటీఆర్, హరీశ్ రావు ఇసుక మాఫియాతో రూ.వేల కోట్లకు అధిపతులుగా మారారని సీఎం విమర్శించారు.

cm-revanth-made-key-comments-in-assembly-over-cbi-probe-over-brs-leaders-involvement-in-kaleswaram

బీజేపీ సభ్యుల పై రేవంత్ ఆగ్రహం

కాగా, పొంగులేటిని హరీశ్ రావు కుటుంబ సభ్యులు బెదిరించారని ఆరోపించారు. హరీశ్ రావు మామ, తమ్ముడు, బావమరిది పేరుపై భూ బదలాయింపు చేయనందుకే పొంగులేటిపై కక్షకట్టారని అన్నారు. భూ దోపిడీపై హౌజ్ కమిటీకి సిద్ధమా అని సవాలు విసిరారు. హౌజ్ కమిటీకి హరీశ్ రావు, కేటీఆర్, వెంకటరమణారెడ్డి సిద్ధమంటే.. వెంటనే ప్రకటిస్తామని సీఎం తెలిపారు. రెడ్డికి చెప్పి కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరిపించలేరా అని ప్రశ్నించారు. కిషన్​ రెడ్డికి చెప్పే ధైర్యం వెంకటరమణారెడ్డికి లేదా అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ధరణి పోర్టల్​ను అడ్డుపెట్టుకుని చేసిన భూ దోపిడీ అక్రమాలపై హౌస్​ కమిటీ వేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. రాఘవ కన్​స్ట్రక్షన్​ వ్యవహారంపై మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలి డిమాండ్ చేస్తున్నారు. పోడియం వైపు వెళ్లేందుకు హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల యత్నంచగా మార్షల్స్ అడ్డుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+