హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయి..!!

ముఖ్యమంత్రి రేవంత్ పెట్టబడుల ప్రయత్నాలు ఫలమిస్తున్నాయి. సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ వరుస ఒప్పందాలు చేసుకుంటున్నారు. రేవంత్ టీం దావోస్ పర్యటనకు ముందుగా సింగపూర్ లో పలు సంస్థలతో చర్చలు చేస్తోంది. తెలంగాణలో పెట్టబడులు.. సహకారం పైన అవగాహన ఒప్పందాలు చేసుకుంటోంది. అందులో భాగంగా హైదరాబాద్ లో ఐటీ పార్క్ కోసం క్యాపిటల్ లాండ్ తో రేవంత్ ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. ఇక, దావోస్ కేంద్రంగా పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో రేవంత్ సమావేశం కానున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ సింగపూర్ పర్యటనలో పలు ఒప్పందాలు చేసుకుంటున్నారు. పెట్టుబడి దారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో రూ. 450 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రపంచ అగ్రగామి సంస్థ క్యాపిటల్యాండ్ ముందుకొచ్చింది. దాదాపు ఒక మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ఐటీ పార్క్‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. సింగపూర్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో క్యాపిటల్యాండ్ కీలక నిర్ణయం ప్రకటించింది. ప్రీమియం సౌకర్యాలను కోరుకునే బ్లూ-చిప్ కంపెనీలు. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల నుండి పెరుగుతున్న డిమాండ్‌ను కొత్త ప్రాజెక్ట్ తీర్చనుంది.

CM Revanth MOU With CapitaLand Company For Rs 450 Crore New IT Park In Hyderabad

క్యాపిటల్ ల్యాండ్ కొత్త ప్రాజెక్ట్, హైదరాబాద్ అభివృద్ధికి మరింత దోహద పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ సాంకేతిక, పారిశ్రామిక అభివృద్ధిలో ఇదొక మైలురాయిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే మూడు వ్యాపార పార్కులను కాపిటాల్యాండ్ నిర్వహిస్తోంది. ఇంటర్నేషనల్ టెక్ పార్క్ హైదరాబాద్ , ఎవాన్స్ హైదరాబాద్, సైబర్ పెర్ల్ ఏర్పాటు చేసిన క్యాపిటల్యాండ్ హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ రెండవ దశ పనులు ఈ ఏడాది ప్రారంభమై 2028నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల ద్వారా తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే సింగపూర్ పర్యటనలో భాగంగా ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌తో తెలంగాణలో యంగ్ ఇండియా యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+