మరో ఎన్నికల సమరానికి సై , ముహూర్తం ఫిక్స్ - సెమీ ఫైనల్స్..!!
తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధించినా.. తుది ఫలితాల పైన మాత్రం సమీక్ష చేస్తున్నారు. తమకు వచ్చిన సీట్ల పైన బీఆర్ఎస్ నేతలు హ్యాపీగానే ఉన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ పైన వ్యతిరేకత స్పష్టంగా ఫలితాల్లో కనిపించిందని చెబుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి ముహూర్తం దాదాపు ఖరారైంది. ఇక.. ఈ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారనున్నాయి. 2028 ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా నిలవనున్నాయి.
రేవంత్ సర్కార్ మరో ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. మునిసిపల్ ఎన్నికలనూ నిర్వహించా లని యోచిస్తోంది. అన్నీ కుదిరితే.. జనవరిలోనే మునిసిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, పార్టీ పరంగా జరిగే మునిసిపల్ ఎన్నికలకు ముందే బీసీ రిజర్వేషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై కసరత్తు చేస్తోంది. వాస్తవనికి పంచాయతీ ఎన్నికల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను అమలు చేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నించింది. మరోవైపు.. పంచాయతీలకు పాలక వర్గాలు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన రూ.3వేల కోట్లు ఆగిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఆ నిధులు రాబట్టుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం.. పాత రిజర్వేషన్ ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా మరో జీవో విడుదల చేసింది.

కాగా.. మునిసిపల్, పరిషత్ ఎన్నికలు పార్టీ గుర్తుపై నిర్వహించే ఎన్నికలు కావడంతో బీసీ రిజర్వేష న్ల పై ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని కోర్టులు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో బీసీలకు పార్టీ పరంగా 42 శాతం సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. వచ్చే క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే ఆస్కారం ఉన్నట్లు తెలిసింది. ముందుగా మునిసిపల్ ఎన్నికలు, ఆ తర్వాత పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications