దానంకు రేవంత్ బిగ్ టాస్క్ - కీలక పదవి ఆఫర్..!!

ముఖ్యమంత్రి రేవంత్ ఆపరేషన్ బీఆర్ఎస్ కొనసాగిస్తున్నారు. వరుసగా గులాబీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ ను ఖాళీ చేయటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం 9 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 29కి చేరింది. ఇదే సమయంలో గ్రేటర్ లో పట్టు కోసం దానం కు రేవంత్ బిగ్ టాస్క్ అప్పగించారు. అందులో సక్సెస్ అయిదే కీలక పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

ఆపరేషన్ బీఆర్ఎస్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలవగా.. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఆ సీటును కాంగ్రెస్ గెలవడంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 38కి చేరింది. ప్రస్తుతం 9 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 29కి చేరింది. ఓ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మరో పార్టీలో చేరితే పదవికి రాజీనామా చేయాల్సి వస్తోంది. అదే ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో 2/3వంతు వేరే పార్టీలో చేరితే పార్టీ శాసనసభా పక్షం విలీనమైనట్లు పరిగణిస్తారు. దీంతో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వర్తించదు.

CM Revanth operation BRS Focus on Greater Hyderabad

గ్రేటర్ పై గురి
ఈ ప్లాన్‌లో భాగంగా మొత్తం 26 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునేందుకు హస్తం పార్టీ ప్లాన్ రెడీ చేసింది. ఇప్పటికే 9మందిని చేర్చుకోగా.. మిగిలిన 17 మందిని మరో 15 రోజుల్లో చేర్చు కునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. బీఆర్‌ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని.. ఇద్దరు నుంచి ముగ్గురే ఆ పార్టీలో మిగులుతారంటూ దానం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ అండతో అక్రమాలకు పాల్పడిన వాళ్లను వదిలిపెట్టబోమని.. అందరి పేర్లు బయటకు తీస్తామని హెచ్చరించారు.

దానంకు బాధ్యతలు
కొంతమంది పేర్లను సైతం దానం నాగేందర్ బయటపెట్టారు. రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పాటు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో తన బలాన్ని పెంచుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి పక్యా వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లోకి తీసుకొస్తే మంత్రి పదవి ఇస్తామంటూ దానం నాగేందర్‌కు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో గ్రేటర్ పరిధిలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చే పూర్తి బాధ్యతల్ని దానం నాగేందర్ తన భుజస్కందాలపై వేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో..మరి రేవంత్ ప్లాన్ ఏ మేర సక్సెస్ అవుతుంది..కేసీఆర్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+