Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Narendra Modi: రాష్ట్రానికి ఐఐఎం కేటాయించాలని ప్రధాని విజ్ఞప్తి చేసిన సీఎం..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ముగిసింది. ఈ రెండు రోజుల్లో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రధాన మంత్రి పర్యటన ముగించుకుని తిరిగి ఢిల్లీకి వెళ్తున్న క్రమంలో ప్రధాన మంత్రి మోడీకి సీఎం రేవంత్ రెడ్డి వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి పలు అంశాలతో వినతి పత్రం అందజేశారు. వినతి పత్రంలో ఎన్టీపీసీ మిగిలిన 2400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్రం సహకరించాలని కోరారు. రాష్ట్రం నుంచి అన్ని సహకారాలు అందిస్తామని చెప్పారు.

మూసీ ప్రక్షాళన రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సహకరించాలని రేవంత్ విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించాలని కోరారు. 2022-23లోనే కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ కోసం 3 కోట్లు మంజూరు చేసిందని రేవంత్ గుర్తు చేశారు. రాష్ట్రంలో పెరిగిన జిల్లాల సంఖ్య , పోలీస్ కమిషనరేట్ల సంఖ్యకు అనుగుణంగా ఐపీఎస్ లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

CM Revanth Reddy appealed to allocate IIM to Telangana

అత్యవసరంగా 29 పోస్టులను అదనంగా కేటాయించాలని కోరారు. హైదరాబాద్- రామగుండం, హైదరాబాద్-నాగ్పూర్ రహదారిపై రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి ఒకే చెప్పినందుకు ప్రధానికి రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. వీటితో పాటు కారిడార్ల నిర్మాణానికి కంటోన్మెంట్ ఏరియాలో 178 ఎకరాలు రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. అలాగే తెలంగాణకు ఒక ఐఐఎం ఇవ్వాలని కోరారు.

ఐఐటీ, నల్సార్, సెంట్రల్ యూనివర్సిటీ తో పాటు ఎన్నో పేరొందిన పరిశోధన, ఉన్నత విద్యా సంస్థలు హైదరాబాద్ లో ఉన్నాయని రేవంత్ గుర్తు చేశారు. ఐఐఎం కూడా మంజూరు చేస్తే బాగుంటుందన్నారు. అందుకోసం అవసరమైన భూమి కూడా కేటాయిస్తామని చెప్పారు. నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. కల్వకుర్తి-కొల్లాపూర్, గౌరెల్లి-వలిగొండ, తొర్రూర్-నెహ్రూనగర్, నెహ్రూనగర్-కొత్తగూడెం, జగిత్యాల-కరీంగర్ ఫోర్ లేన్ త్వరగా పూర్తి చేయాలని కోరారు. వీడ్కోలు పలికినవారిలో రేవంత్ తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+