Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉగాది నుంచి సీఎం రేవంత్ రెడ్డి జాతకం ఎలా ఉందంటే!

తన బెడ్ రూం తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేసినా, కూతురి పెళ్లి వేడుకకు దూరం చేసినప్పటికీ ధైర్యాన్ని కోల్పోకుండా, ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ విసిగిపోయిన ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టారు. వందరోజుల పాలన పూర్తిచేసుకున్న రేవంత్ లోక్ సభ ఎన్నికలపై గురిపెట్టారు. ప్రధాన పోరు కాంగ్రెస్, బీజేపీ మధ్యనే సాగనుంది. రేపటి నుంచి తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ కు ఎలా ఉండబోతోందనే విషయాన్ని నెటిజన్లు ఎక్కువగా శోధిస్తున్నారు.

1969 నవంబరు 8వ తేదీ మధ్యాహ్నం రెండుగంటలకు రేవంత్ జన్మించారు. తులారాశి, చిత్త నక్షత్రం. క్రోధి నామ సంవత్సరం సందర్భంగా ఆయన జాతకం ప్రకారం మహర్దశ పట్టనుందని జ్యోతిష్య పండితులు అభిప్రాయపడుతున్నారు. ఎటువంటి అంతరాయం తలెత్తకుండా ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పరిపాలన కొనసాగిస్తారని చెబుతున్నారు. భవిష్యత్తులో ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం కనపడుతోందంటున్నారు. ఆయన జాతకం ప్రకారం అలాగే ఉందని వెల్లడిస్తున్నారు.

cm revanth reddy astrology predections in krodhi nama samvatsaram

కేసీఆర్ రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత అహంకారపూరితంగా వ్యవహరించడం, ప్రతిపక్షాలను వేధించడం, ప్రజలను పట్టించుకోకపోవడంతోపాటు మంత్రుల అవినీతి తదితర కారణాలతో ప్రజలు విసిగెత్తిపోయారు. ఒక్కసారిగా అటువంటి సమయంలో రేవంత్ యాక్టివ్ అవడం బాగా కలిసివచ్చిందని పండితులు చెబుతున్నారు. అలాగే టీఆర్ఎస్ పేరు ఎప్పుడైతే బీఆర్ఎస్ గా మారిందో అప్పటినుంచే ఆ పార్టీ పతనం ప్రారంభమైందనే భావన తెలంగాణ ప్రజానీకంలో కూడా ఉంది. తుక్కుగూడలో జరిగిన సభ కూడా జనజాతరను తలపించడం రేవంత్ కు బాగా కలిసివచ్చింది. పార్టీలో సీనియర్లను కలుపుకుపోవడంతోపాటు ఢిల్లీ పెద్దల దగ్గర మంచి మార్కులు సాధించారు. మంత్రిగా పనిచేసిన అనుభవం లేకపోయినప్పటికీ ముఖ్యమంత్రి పదవిని సమర్థంగా నిర్వహిస్తూ వస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+