రేవంత్ రెడ్డి మనసంతా ఎల్లో: ఆకర్షించిన పసుపు టీషర్ట్: ఆరా తీసిన సీఎం

Revanth Reddy: కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కే సమయంలో గీత కార్మికులు వినియోగించే మోకులను మరింత సురక్షితంగా డిజైన్ చేసింది. కాటమయ్య రక్షా కవచం పథకం కింద వాటిని అందజేసింది.

ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడలో స్వయంగా ఈ మోకులను గీత కార్మికులకు.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి గీత కార్మికులకు పంపిణీ చేశారు. ఈ మోకులను ఆధారంగా చేసుకుని ముఖ్యమంత్రి, మంత్రుల సమక్షంలో గీత కార్మికులు చెట్లు ఎక్కారు.

CM Revanth Reddy has praised a toddy tapper who wear Yellow T shirt

ఈ సమయంలో వారితో ముచ్చట పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి. వారి సాధక బాధకాల గురించి ఆరా తీశారు. కుటుంబ ఆదాయ వివరాల గురించి ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఎంత వరకు సంక్షేమ పథకాలు అందుతున్నాయనే విషయాన్ని వారినే అడిగి తెలుసుకున్నారు. కల్లులో నీళ్లు కలిపితే బయటి వాళ్లకు తెలుస్తుందా? అంటూ నవ్వుతూ ప్రశ్నించారు.

ఈ సందర్భంగా పసుపు పచ్చ టీషర్ట్ వేసుకున్న లక్ష్మయ్య అనే ఓ గీత కార్మికుడు రేవంత్ రెడ్డిని ఆకర్షించారు. లక్ష్మయ్య వివరాలను అడిగి మరీ తెలుసుకున్నారాయన. పసుపు పచ్చ టీషర్ట్ బాగుందంటూ కితాబిచ్చారు. ఏం గౌడ్ సాబ్.. ఆ ఎల్లో టీ షర్ట్ వేసుకున్నాయన పేరు ఏం పేరు? అని అడిగారు. ఎల్లో టీషర్ట్ వేసుకున్నాయన.. గుచ్చి మరీ అడిగారు.

గౌడ్ సాబ్ నీ టీషర్ట్ బాగుంది.. అంటూ కితాబిచ్చారు రేవంత్. ఈ లోగా మరో గీత కార్మికుడు.. ఆయన పేరు లక్ష్మయ్య అని తెలిపారు. లక్ష్మయ్యనా. మంచి మంచి లక్ష్మయ్య. సంతోషం.. అని బదులిచ్చారు రేవంత్. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాంగ్రెస్‌లో చేరకముందు రేవంత్ రెడ్డి సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో పని చేసిన విషయం తెలిసిందే. టీడీపీ తరఫున శాసన మండలికి ఎన్నికయ్యారు. 2009, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2017లో పార్టీ ఫిరాయించారు. కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+