Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేవంత్ ప్రభుత్వంలో కోదండరామ్ కు కీలక పదవి..!!

తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం కొలువు తీరింది. మంత్రివర్గంలో అనుభవానికి పట్టం కట్టారు. తొలి మంత్రివర్గ సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక..ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషించే నియామకాల పైన రేవంత్ కసరత్తు చేస్తున్నారు. ఇంటలిజెన్స్ చీఫ్ గా శివధర్ రెడ్డిని నియమించారు. సీఎంఓ ముఖ్య కార్యదర్శి నియామకం పూర్తయింది. ఇక.. ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు కొత్త ప్రభుత్వంలో కీలక పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

టీం కూర్పులో రేవంత్: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ తన టీంను సిద్దం చేసుకుంటున్నారు. అందులో భాగంగా.. టీజేఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ సారథి ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు కొత్త ప్రభుత్వంలో కీలక పదవి దక్కనున్నట్లు తెలిసింది. ఆయనను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. కోదండరామ్‌, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే.

CM Revanth Reddy likely to appoint Professor Kodanda Ram as Government Chief Advisor

ఈ దృష్ట్యా ప్రభుత్వ పాలనలో ఆయన సహకారం తీసుకోవాలన్న ఉద్దేశంతో రేవంత్‌ రెడ్డి ఉన్నట్లు సమాచారం. నిజానికి ఎన్నికలకు ముందు నుంచే కోదండరామ్‌తో రేవంత్‌ రెడ్డి పలుమార్లు కలుస్తూ వచ్చారు. కాంగ్రెస్‌తో టీజేఎస్‌ పొత్తు పెట్టుకునేలా చేశారు. కోదండరామ్‌ కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ వచ్చారు.

కోదండ రామ్ కు కీలక పదవి: సచివాలయం వద్ద జరిగిన ఉద్యోగుల సంబురాల్లో పాల్గొని, బీఆర్‌ఎస్ పై విరుచుకుపడ్డారు. ఉద్యోగ సంఘాలను అణగదొక్కిందని, వారికి ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇవ్వలేదని ఆరోపించారు. అదే సందర్భంలో కొత్త ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వారధిగా పని చేస్తామని ప్రకటించారు. దీంతో ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందన్న వార్తలు బయటకు వచ్చాయి. రేవంత్‌ రెడ్డి కూడా కొంత మంది మేధావులను పరిగణనలోకి తీసుకుని, కీలక పాత్రలు అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నారు.

అందులో భాగంగానే కోదండరామ్‌కు ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవి ఇవ్వనున్నారని సమాచారం. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఢిల్లీ కార్యకలాపాల్లో సహకరించిన రాజీవ్‌ శర్మను కేంద్ర సర్వీసుల నుంచి మాజీ సీఎం కేసీఆర్‌ రప్పించుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

విద్యా - ఉద్యోగ రంగాల బాధ్యతలు: సీఎస్ గా రిటైర్‌ అయిన తర్వాత శర్మను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించారు. ఇప్పటికీ ఆయన అదే పోస్టులో ఉన్నారు. ఆయన ఆ పోస్టు నుంచి తప్పుకుంటారని చర్చ జరుగుతోంది. ఒకవేళ తప్పుకోకపోయినా ప్రభుత్వమే పంపించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఆ పోస్టులో కోదండరామ్‌ను నియమిస్తారని సమాచారం.

ఆయనకు రాష్ట్ర వనరులు, విద్య, తెలంగాణకు అనుకూలమైన పరిపాలన వంటి రంగాల్లో అపారమైన పరిజ్ఞానం ఉంది. అలాంటి వ్యక్తిని సలహాదారుగా నియమిస్తే సీఎంగా తాను సక్సెస్‌ కావడానికి దోహదపడుతుందని రేవంత్‌ భావిస్తున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ బాధ్యతల పైన చర్చ సాగుతోంది. దీంతో...ఈ రెండు పదవుల్లో ఒకటి కోదండరామ్ కు ఖరారు కావటం ఖాయంగా కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+