ప్రభాస్‍‌ది హాలీవుడ్ రేంజ్: ఆర్జీవీ మిత్రుడంటూ సీఎం రేవంత్ ప్రశంసలు

హైదరాబాద్: రెబల్ స్టార్ ప్రభాస్‌ది.. టాలీవుడ్. బాలీవుడ్ కాదు.. హాలీవుడ్ రేంజ్ అంటూ ప్రశంసలు కురిపించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అభినందన సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ రాష్ట్రంలో ఐదు లక్షల జనాభా క్షత్రియులు ఉన్నట్లు క్షత్రియ సేవా సమితి సభ్యులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు.

అనంతరం క్షత్రియ భవనంతో పాటు క్షత్రియుల్లోని పేదలకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సీఎంను కోరారు. అలాగే తమకు రాజకీయాల్లోనూ అవకాశాలు కల్పించాలని కోరారు. దీనిపై సీఎం స్పందిస్తూ రాజ దర్పం ప్రదర్శించేలా అల్లూరి సీతారామరాజు పేరిట భవన నిర్మాణం చేపట్టాలని అందుకు ప్రభుత్వ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. విజయానికి, నమ్మకానికి క్షత్రియులు మారుపేరని రేవంత్‌రెడ్డి అన్నారు.

CM Revanth Reddy praises Prabhas in Kshatriya Seva Samithi meeting

రాజులు ఏ రంగంలో అడుగుపెట్టిన అక్కడ కచ్చితంగా రాణిస్తారని, అంత నిబద్ధతతో పనిచేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో కూడా అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. తొలుత పార్టీలో అవకాశం ఇస్తామన్న ఆయన.. తర్వాత ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తామని మాట ఇస్తున్నట్లు చెప్పారు. విశ్రాంత ఐఏఎస్‌ శ్రీనివాసరాజును ప్రభుత్వ సలహాదారుగా నియమించామని ముఖ్యమంత్రి తెలిపారు. వారి ద్వారా క్షత్రియులు తనను కలవొచ్చని తెలిపారు.

మీడియా, సినిమా రంగాల్లో రాజులదే పై చేయి అని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అన్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాటు బాహుబలితో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రభాస్‌​ను గుర్తు చేశారు సీఎం రేవంత్. ప్రభాస్ లేకుండా బాహుబలి లేదని కితాబిచ్చారు.

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రభాస్‌ విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. రాంగోపాల్ వర్మ తనకు మిత్రుడని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో రాజులు పెట్టుబడులు పెట్టాలని కోరారు సీఎం రేవంత్. మరోవైపు, కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఒక ఫైటర్ అని అన్నారు. ఆయన మాటిస్తే తప్పకుండా నిలబడతారని క్షత్రియ సమాజానికి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+