కన్హా శాంతివనాన్ని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతోన్న విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సాఫ్ట్ స్కిల్స్ నేర్పించే దిశగా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా గ్రామంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి.
ఈ సందర్భంగా అక్కడ చిన్నారులు, విద్యార్థులకు నేర్పించే సాఫ్ట్ స్కిల్స్ కు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని రంగులను గుర్తించడం, పదాలను చదవడం వంటి స్కిల్స్‌ను ప్రదర్శించిన అక్కడి విద్యార్థులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.

కన్హా శాంతి వనం నిర్వాహకులు, శ్రీ రామ్ చంద్ర మిషన్ అధ్యక్షులు, హర్ట్ ఫుల్ నెస్ గ్లోబల్ గైడ్, ఆధ్యాత్మికవేత్త గౌరవ కమలేష్ పటేల్ (దాజీ) స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. వనమంతా తిప్పి చూపించారు. కన్హా శాంతివనం ఆవరణలోని ట్రీ కన్జర్వేషన్ సెంటర్ లో వివిధ రకాల వంగడాల అభివృద్ధి, మొక్కల పెంపకానికి సంబంధించిన విధానాలను శాంతి వనం నిర్వాహకులు సీఎంకు వివరించారు.
శాంతి వనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెయిన్ ఫారెస్ట్ ను, మెడిటేషన్ సెంటర్ హలును సందర్శించిన సీఎం రేవంత్ అక్కడ ఒక మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, కాలే యాదయ్య, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
-
వారికి గుడ్ న్యూస్.. కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ -
ఆర్టీవో ఆఫీసులకు తిరిగే పని లేకుండా తెలంగాణా వాహనదారులకు సీఎం రేవంత్ శుభవార్త! -
మూసీ తీరాన ఆధ్యాత్మిక వైభవం.. 700 కోట్లతో భారీ ఆలయాల ప్రాజెక్ట్.. సీఎం శంకుస్థాపన -
మూసీపై బిగ్ స్టెప్- చెప్పిందే చేసిన రేవంత్ -
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !!












Click it and Unblock the Notifications