తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: ఆరుమందికి చోటు: లిస్ట్‌తో ఢిల్లీకి రేవంత్

Revanth Reddy: తెలంగాణలో రాజకీయ వాతావరణ ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. దేశ రాజధానిలో పర్యటించనున్నారు. నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టీ వారి పర్యటన మీదే నిలిచింది.

ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిపి 12 మంది ఉన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచీ అదే మంత్రివర్గం కొనసాగుతోంది. ఎనిమిది నెలలుగా అదే కేబినెట్ ప్రభుత్వ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ వస్తోంది.

CM Revanth Reddy will travel Delhi to discuss Cabinet expansion with Congress today

మంత్రుల సంఖ్యను ఇంకా పెంచుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ.. అది సాధ్యపడలేదు. లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనాల్సి రావడం, శాసన మండలిలో ఖాళీల భర్తీ, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి నుంచి పెద్ద ఎత్తున వలసలు చోటు చేసుకోవడం, వారికీ మంత్రివర్గంలో చోటు కల్పించాల్సి ఉంటుందనే కారణాల మీద మంత్రివర్గ విస్తరణ ఆలస్యమైంది.

ఇప్పుడు దీనిపై చేపట్టిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్టేనని తెలుస్తోంది. మొత్తంగా ఆరుమందిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు చెబుతున్నారు. మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి, మల్​రెడ్డి రంగారెడ్డి, గడ్డం వివేక్‌, ప్రేమసాగర్‌ రావు, ఎమ్మెల్సీ అమీర్‌ అలీ ఖాన్‌, బాలునాయక్‌, రామ్మోహన్‌ రెడ్డి, రామచందర్‌ నాయక్‌, మదన్ మోహన్‌ రావులకు బెర్త్ కన్‌ఫర్మ్ అవుతుందని అంటున్నారు.

మునుగోడు శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పేరు సైతం వినిపిస్తోన్నప్పటికీ.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం పట్ల తప్పుడు సంకేతాలు వెళ్లొచ్చనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి కేబినెట్‌లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు-భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు.

మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపైనా రేవంత్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్ల కోసం అవసరమైన వారి పేర్లను సిద్ధం చేశారని అంటున్నారు. వాటన్నింటినీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపా దాస్ మున్షీ, ఇతర నాయకులతో చర్చించనున్నట్లు చెబుతున్నారు. వాటిపై పార్టీ అధిష్ఠానం ఆమోదముద్ర పడిన తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+