రైతు రుణమాఫీపై తేల్చేసిన రేవంత్- మోదీకి క్లారిటీ

Revanth Reddy: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపిస్తోన్న కొద్దీ.. రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ నెల మూడో వారంలో షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి.

ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్న శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం)- బీజేపీ- ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) సంకీర్ణ కూటమి తరఫున ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. శనివారం నాడు ఆయన మహారాష్ట్రలో పర్యటించారు. బహిరంగ సభల్లో ప్రసంగించారు.

CM Revanth Reddy writes to PM Modi and says every crop loan below Rs 2 lakh was waived

ఈ సందర్భంగా కాంగ్రెస్ సారథ్యంలోని మహా వికాస్ అగాఢీ కూటమిపై ఘాటు విమర్శలు చేశారు. ఈ కూటమి అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇస్తుందని, ఆ తరువాత విస్మరిస్తుందనీ ఆరోపించారు. దీనికి ఉదాహరణగా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రస్తావించారు.

రైతులకు రుణాలను మాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఏడాది గడుస్తోన్నప్పటికీ ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదంటూ ప్రధాని మోదీ విమర్శించారు. దీనిపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయనకు బహిరంగ లేఖ రాశారు. రైతుల రుణమాఫీకి సంబంధించిన పూర్తి వివరాలను అందులో పొందుపరిచారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు రుణ మొత్తం రెండు లక్షల రూపాయల్లోపు ఉన్న రైతులందరికీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే మాఫీ చేశామని రేవంత్ స్పష్టం చేశారు. మూడు విడతల్లో 22,22,067 మంది రైతులకు చెందిన 17,869.22 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసినట్లు వివరించారు.

ఈ ఏడాది జులై 18వ తేదీన లక్ష రూపాయల్లోపు రుణాలు ఉన్న 11,34,412 మంది రైతుల అకౌంట్లకు 6,034.97 కోట్లు, అదే నెల 30వ తేదీన లక్షన్నర లోపు రుణాలు ఉన్న 6,40,823 మంది రైతుల అకౌంట్లకు 6,190.01 కోట్లు, ఆగస్టు 15వ తేదీన రెండు లక్షల రూపాయల వరకు రుణాలు ఉన్న 4,46,832 మంది రైతుల అకౌంట్లకు 5,644.24 కోట్లను బదిలీ చేసినట్లు చెప్పారు.

తెలంగాణ ఆవిర్భవించిన తరువాత ఒకేసారి ఇన్ని వేల కోట్ల రూపాయల మేర రుణాలను మాఫీ చేయడం ఇదే తొలిసారి అని మోదీకి గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. త్వరలోనే ఈ పథకాన్ని రెండు లక్షల రూపాయలకు పైగా రుణాలు ఉన్న రైతులకు కూడా వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ కూడా బంగారంతో సమానమైనవిగా రైతులు ప్రశంసిస్తోన్నారని గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+