ఫ్రైడ్ రైస్‌లో బొద్దింక... షాకైన కస్టమర్.. స్పందించిన జోమాటో..
ఈ మధ్యకాలంలో ఫుడ్ డెలివరీ యాప్స్ వినియోగం బాగా పెరిగింది. వండుకునే తీరిక, ఓపిక లేని వారంతా ఫుడ్ డెలివరీ యాప్స్‌పై ఆధారపడుతున్నారు. ఆ ఫుడ్ నాణ్యత అంతంగా మాత్రంగానే ఉంటున్నాయి. అయినా ఎక్కువమంది వాటినే ఆర్డర్ చేసుకుని ఆరంగించేస్తున్నారు. స్విగ్గీ, జొమాటో వంటి వాటిలో ఈ మధ్యకాలంలో కొన్ని కీటకాలు ప్రత్యక్షమవ్వడం పరిపాటిగా మారింది. అలాంటి సంఘటనే ఇప్పడు తాజాగా హైదరాబాద్‌లో జరిగింది.
బెంగళూరుకు చెందిన హర్షిత అనే మహిళ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చింది. ఆమె అకలేస్తుందని జొమాటోలో ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసింది. ఆ ఫ్రైడ్ రైస్ పార్సిల్‌ను తెరచి చూసి హర్షిత ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఆ ఫ్రైడ్ రైస్‌లో చనిపోయిన బొద్దింక కనిపించింది. దాంతో హర్షిత ఆ ఫ్రైడ్ రైస్ వీడియో తీసి సోషల్‌మీడియాలోని తన ఖాతాలో పోస్టు చేసింది. 'నేను చికెన్ ఫ్రైడ్ రైస్ కోసం 'Tapri By The corner' అనే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేశాను. కానీ నాకు వచ్చిన పార్సిల్‌లో చచ్చిన బొద్దింక కనిపించింది. దాంతో నేను షాకయ్యా. ఈ అశుభ్రత కరెక్ట్ కాదు. దీనికి మేం తక్షణ పరిష్కారం కోరుకుంటున్నాం' అని హర్షిత ఇంగ్లీషులో వివరాలను జతచేసింది.

@deepigoyal @jagograhakjago @zomato
— Harshitha (@Harshit99115881) December 12, 2023
I orderd chicken fried rice in zomato from restaurent "TAPRI BY THE CORNER". I got cockroach in my food.
Absolutely disgusted with my order! This is completely unacceptable and unhygienic. Need an immediate resolution. #Zomato #FoodSafety" pic.twitter.com/f0JEqpKNSJ
స్పందించిన జొమాటో : వీడియో పోస్ట్ చేసిన కొద్ది సయంలోనే సోషల్‌మీడియాలో తెగ వైరల్ అయ్యింది. చికెన్ ఫ్రైడ్ రైస్ తయారు చేసిన రెస్టారెంట్‌పైన, డెలివరీ చేసిన జొమాటోపైన నెటిజన్‌లు విమర్శలు చేస్తున్నారు. ఈ వైరల్ వీడియోను చూసిన జొమాటో దీనిపై స్పదించింది. 'హర్షితగారు ఇది అనుకోకుండా జరిగింది. ఈ ఘటన మిమ్మల్ని ఎంత బాధపెట్టిందో మేం అర్థం చేసుకోగలం. దయచేసి మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌ను, ఆర్డర్ ఐడీ మాకు పంపించండి. మేం త్వరలో చర్యలు తీసుకుంటాం' అని జొమాటో తన రిప్లైలో పేర్కొనడం జరిగింది. ఏది ఏమైనా ఫుడ్ డెలివరి యాప్‌లో ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో తరచుగా జరుగుతున్నాయి. ఇలాంటివి దేశంలోని అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. బెంగుళూరు, హైదరాబాద్, ఢిల్లీ వంటి మహానగరాల్లో ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications