Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విచిత్ర దొంగతనం.. కొబ్బరిబొండాలు కూడా వదిలిపెట్టరా.. ఏంట్రా ఇది!

ఇటీవల కాలంలో దొంగతనాలు కూడా చిత్రవిచిత్రమైన దొంగతనాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న గణేష్ నవరాత్రుల సందర్భంగా వినాయకుడి చేతిలోని లడ్డులు చోరీ చేస్తే, ఇక తాజాగా కొబ్బరి బోండాలని దొంగతనం చేస్తున్న ఓ విచిత్ర దొంగతనం వెలుగులోకి వచ్చింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో విచిత్ర దొంగతనం జరిగింది.

కొబ్బరి బొండాల దొంగతనం
రోడ్డు పక్కన కొబ్బరి బొండాలు అమ్ముకుంటూ జీవనం సాగించే వారి బండిపై పెట్టి టార్పాలిన్ తో కట్టిన కొబ్బరికాయలను ఓ వ్యక్తి రాత్రి దొంగిలించాడు. కొబ్బరి బొండాలు అమ్ముకుంటూ జీవనం సాగించే సదరు వ్యక్తులు పైనుండి కవర్ కప్పి ఇంటికి వెళ్లిన తర్వాత, కవర్ తీసి ఆటోలో కొబ్బరి బొండాలు వేసుకుని వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

coconuts theft in banjara hills shocking video viral in social media

Take a Poll

సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన దొంగతనం దృశ్యాలు
ఆ దొంగ అటు ఇటు చూస్తూ కొబ్బరి బొండాలు ఆటోలో వేసుకుని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఇక కొబ్బరి బొండాలు దొంగతనం జరుగుతుందని గుర్తించిన సదరు కొబ్బరి బొండాల బండి యజమాని దొంగను పట్టుకోవడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నాడు. గతంలో కూడా ఇదే విధంగా రెండు సార్లు దొంగతనం జరిగినట్టు చెబుతున్నాడు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొబ్బరి బొండాల చోరీ
రోజంతా కష్టపడి కొబ్బరి బొండాలు అమ్ముకుని జీవనం సాగించే తమ పొట్ట కొట్టడానికి ఈ తరహా దొంగతనాలు జరుగుతున్నాయని అతడు సీసీ టీవీ ఫుటేజ్ ను సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయకుండా వీడియోలు వైరల్ చేయడంతో ప్రస్తుతం ఈ కొబ్బరి బొండాల దొంగతనం పైన సమాజంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

చర్యలకు నెటిజన్లు డిమాండ్
చివరికి మనుషులు ఎంతకు దిగజారారు అనే భావన కలుగుతుంది. చిన్నదైనా పెద్దదైనా దొంగతనం దొంగతనం కాబట్టి, ఇటువంటి ఘటనలు పైన పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని, దుకాణం యజమాని ఫిర్యాదు చేయనప్పటికీ పోలీసులు ఇటువంటి వారి ఆగడాలకు చెక్ పెట్టాలని ఈ వీడియో చూసిన వారు కోరుతున్నారు. కష్టపడి పని చేసేవారు వారి కష్టానికి తగినట్టుగా ఫలితం వచ్చేలా చూడాలని, ఈ తరహా దోపిడీకి గురికాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+