Varanasi: రాజమౌళికి లేనిపోని చిక్కులు..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న మైథలాజికల్ అడ్వెంచర్ మూవీ వారణాసి. ఈ మూవీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చిక్కుల్లో పడ్డారు. హైదరాబాద్ ఫిల్మ్ సిటీలో టైటిల్ ఆవిష్కరణ సందర్భంగా ఇచ్చిన ప్రసంగం, చేసిన వ్యాఖ్యలు ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టాయి. చట్టపరమైన ఇబ్బందుల్లోకి నెట్టాయి. తనకు దేవుడిపై నమ్మకం లేదని రాజమౌళి చెప్పడం.. హిందూ సంఘాల ప్రతినిధులకు ఆగ్రహానికి గురి చేసింది.
ఆంజనేయుయ స్వామిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యల పట్ల కోట్లాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని రాష్ట్రీయ వానరసేన సంఘం ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. అందులో పలు అంశాలను ప్రస్తావించారు. సాక్ష్యంగా ప్రింట్ మీడియాలో వచ్చిన కొన్ని క్లిప్ లను వాళ్లు తమ ఫిర్యాదు పత్రానికి జత చేసినట్లు చెబుతున్నారు.

వారణాసి చిత్రం టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమంలో హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయని ఫిర్యాదులో పొందుపరిచారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఎవరూ కూడా దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా ఈ చర్యలు ఉండాలని అన్నారు. ఒకరికి కఠిన శిక్షపడితే మరొకరు అటువంటి వ్యాఖ్యలు చేయడానికి భయపడతారని పేర్కొన్నారు.
టైటిల్ ఆవిష్కరణ సమయంలో కొంత టెక్నికల్ సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. దీనికి వివరణ ఇచ్చాడు రాజమౌళి. తనకు దేవుడిపై నమ్మకం లేదని చెప్పాడు. సాంకేతిక ఇబ్బందులు తలెత్తినప్పుడు తాను ఆందోళనకు గురయ్యానని, తన తండ్రి విజయేంద్రప్రసాద్ ధైర్యం చెప్పాడని, అంతా హనుమంతుడు చూసుకుంటాడని వెనక ఉండి నడిపిస్తాడు సముదాయించారని చెప్పారు. టెక్నికల్ ఎర్రర్ వచ్చినప్పుడు అసహనానికి గురయ్యానని అన్నాడు. తన భార్య రమా హనుమాన్ అంటే చాలా చాలా ఇష్టమని వ్యాఖ్యానించాడు.












Click it and Unblock the Notifications