భార్య ప్రియాంక, కుమార్తె భద్రతపైనా ఆందోళనగా ఉంది: రాబర్ట్ వాద్రా సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా శుక్రవారం హైదరాబాద్ నగరంలో పర్యటించారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడిని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆధ్యాత్మిక చింతనతోనే తాను హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు. తన పర్యటనలో రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు.


దేశంలో మహిళల భద్రత ప్రధాన సమస్యగా మారిందన్నారు రాబర్ట్ వాద్రా. తన భార్య ప్రియాంక గాంధీ, కుమార్తె భద్రత విషయంలోనూ అప్పుడప్పుడు ఆందోళనగా అనిపిస్తోందన్నారు రాబర్ట్​ వాద్రా. మహిళలు భద్రంగా ఉండాలంటే వారితో ఎలా ప్రవర్తించాలో ఇంట్లో నేర్పించాలని సూచించారు. పరోక్షంగా కోల్​‌కతా ఘటనపై ఆయన మాట్లాడారు.

Concerned about wife Priyanka daughter s safety Robert Vadra

రాహుల్​ గాంధీ, తాను మహిళల భద్రత విషయం గురించే మాట్లాడుతున్నామని రాబర్ట్​ వాద్రా చెప్పారు. దేశంలోని సమస్యలను మేమిద్దరం ఒకే కోణంలో చూస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అది మరో ఐదేళ్ల తర్వాత మార్పు చూపిస్తారని ఆశిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు.


'మన దేశంలో ముఖ్యంగా మహిళల భద్రతపై ఆందోళన కలుగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు ఈవిషయంపై ఆలోచించాలి. కోల్‌​కతా ఘటన తర్వాత దేశం ఎటువైపు వెళుతుందో ఆలోచించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. మహిళలు ఇంటి నుంచి బయటకు వెళితే భయంగా ఉంటుంది. వారి తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకుంటారా లేదా అని' రాబర్ట్ వాద్రా వ్యాఖ్యానించారు.


ప్రియాంక గాంధీ వయనాడ్​ నుంచి పోటీ చేయబోతున్నందుకు సంతోషంగా ఉందని రాబర్ట్​ వాద్రా తెలిపారు. అందుకు ఆమెకు ఆల్​ ది బెస్ట్​ చెబుతున్నానని అన్నారు. బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్​ వ్యాఖ్యలపై కూడా రాబర్ట్​ వాద్రా స్పందించారు. కంగనా అంటే గౌరవం ఉంది కానీ.. ఆమెకు పార్లమెంటులో ఉండే అర్హత లేదని ఘాటుగా స్పందించారు. కాగా, అంతకుముందు శంషాబాద్​ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రాబర్ట్ వాద్రాకు కాంగ్రెస్​ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+