సీఎంగా ఆయనే సమర్ధుడు - హైకమాండ్ కు మెజార్టీ ఎమ్మెల్యేల క్లారిటీ..!!
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి పైన కాంగ్రెస్ ఒక అంచనాకు వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాల నడుమ సీఎం ఎంపిక విషయంలో ఇక ఆలస్యం చేయకూడదనే నిర్ణయానికి వచ్చింది. సీఎల్పీ నేతను ఎన్నుకొనేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశంలో హైకమాండ్ కు బాధ్యత అప్పగిస్తూ తీర్మానం చేసారు. అదే సమయంలో గెలిచిన ఎమ్మెల్యేలతో ఒన్ టు ఒన్ సమావేశమై సీఎంగా ఎవరికి మద్దతనేది తేల్చారు. ఈ సాయంత్రానికి కొత్త సీఎం ఎవరో స్పష్టత రానుంది.
హైకమాండ్ కే బాధ్యత
తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహారం ఈ రోజునే తేల్చాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రస్తుతం సమావేశమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం ఎంపిక అధికారం పార్టీ హైకమాండ్ కు అప్పగిస్తూ ఏకవ్యాఖ్య తీర్మానం పంపారు. పార్టీని గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ తొలుత తీర్మానం ఆమోదించారు.

అదే విధంగా పార్టీ గెలుపు కోసం ప్రచారం చేసిన పార్టీ అగ్రనాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ మరో తీర్మానం ఆమోదం తెలిపారు. ఇక.. సీఎల్పీ నేతగా ఎవరిని ఎంపిక చేసినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మరో తీర్మానాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ ప్రతిపాదించారు. దీనికి భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి సహా మరో పది మంది నేతలు మద్దతు తెలిపారు.
ఈ మధ్నాహ్నం ప్రకటనకు ఛాన్స్
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు తెలంగాణ సీఎంగా నియమితులను చేసే అధికారం సీఎల్పీ సమావేశంలో అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక, ఇదే సమయంలో పార్టీ హైకమాండ్ ప్రతినిధులు ఎమ్మెల్యేలతో ఒన్ టు ఒన్ సమావేశమయ్యారు. సీఎంగా ఎవరిని ఎంపిక చేస్తే బాగుటుందనే అంశం పైన అభిప్రాయాలు సేకరించరారు.
వారంతా ఎవరు సీఎం అవ్వాలనే దాని పైన తమ అభిప్రాయాలను స్పష్టం చేసారు. దీంతో, సీఎల్పీ సమావేశంలో చేసిన తీర్మానం..ఎమ్మెల్యేల అభిప్రాయాలను హైకమాండ్ కు నివేదించారు. ఈ మొత్తం పరిశీలించిన తరువాత ఈ మధ్నాహ్నం తెలంగాణ నూతన ముఖ్యమంత్రిని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
ఈ సాయంత్రమే ప్రమాణ స్వీకారం
సీనియర్ల ఆలోచనల్లో వస్తున్న మార్పులు..అటు మెజాట్టి కంటే నాలుగు సీట్లు మాత్రమే ఎక్కువగా ఉండటంతో హైకమాండ్ అలర్ట్ అయింది. దీంతో..ఈ రోజునే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాలని..డిసెంబర్ 9న మంత్రివర్గ విస్తరణ..బహిరంగసభ కు ప్లాన్ చేయాలని సూచిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. రేవంత్ ను సీఎంగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఢిల్లీ సమాచారం.
కర్ణాటక తరహాలో సీఎంగా రేవంత్, పీసీసీ చీఫ్ పదవితో పాటుగా డిప్యూటీ సీఎంగా భట్టి..అదే విధంగా ఎస్టీ, మైనార్టీ వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని సూచన చేసినట్లు విశ్వసనీయ సమాచారం. సీనియర్లక తగిన గుర్తింపు ఇచ్చేలా కీలక శాఖలు ఉంటాయని..పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇవ్వనున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఈ సాయంత్రం తెలంగాణ నూతన సీఎంగా రేవంత్..డిప్యూటీగా భట్టి ప్రమాణ స్వీకారం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications