తెలంగాణా గ్రామాల్లో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు.. షాకింగ్ వీడియో పోస్ట్ చేసిన బీఆర్ఎస్!!
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం పోగొట్టుకొని ప్రతిపక్ష పార్టీగా మిగిలిపోయింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో పాలన పగ్గాలు చేపట్టింది. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య ప్రచ్చన్న యుద్ధం మొదలైనట్టుగా తాజా పరిణామాలతో అర్థమవుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో దాడులు కొనసాగుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన మొదలుపెట్టిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది. తెలంగాణ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు మితిమీరుతున్నాయని ఈ పోస్టు ద్వారా బీఆర్ఎస్ పేర్కొంది.

సూర్యాపేట - తుంగతుర్తి నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లి గ్రామ వాట్సాప్ గ్రూపులో న్యూ ఇయర్ విషెస్ పోస్టు పెట్టినందుకు బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి చేసి తీవ్రంగా కాంగ్రెస్ నాయకులు కొట్టారని బీఆర్ఎస్ పార్టీ తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది.ఈ దాడి తాలూకు వీడియో కూడా పోస్ట్ చేసి కాంగ్రెస్ అరాచక పాలన మొదలు పెట్టిందని పేర్కొంది,
న్యూ ఇయర్ సందర్భంగా విషెస్ చెప్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఫోటోలు జత చేసి గ్రామ వాట్సాప్ గ్రూపులో మహేష్ అనే బీఆర్ఎస్ కార్యకర్త పోస్టు చేయగా గ్రామ సర్పంచ్ మరియు కాంగ్రెస్ నాయకుడు జూల నర్సయ్య మహేష్ ఇంటికి వెళ్లి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డుకోబోయిన మహేష్ తల్లి వీరమ్మ, తమ్ముడు శ్రావణ్ మీద సైతం దాడి చేశారు.
తెలంగాణ గ్రామాల్లో మితిమీరుతున్న కాంగ్రెస్ నాయకుల అరాచకాలు..
— BRS Party (@BRSparty) January 3, 2024
సూర్యాపేట - తుంగతుర్తి నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లి గ్రామ వాట్సాప్ గ్రూపులో న్యూ ఇయర్ విషెస్ పోస్టు పెట్టినందుకు బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి చేసి తీవ్రంగా కొట్టిన కాంగ్రెస్ నాయకులు.
న్యూ ఇయర్… pic.twitter.com/UQvwZPjZaJ
ఈ దాడిలో వారికి తీవ్ర గాయాలయ్యాయని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఉన్మాద దాడులను తీవ్రంగా ఖండిద్దాం..కాంగ్రెస్ హింసా రాజకీయాలను తిప్పికొడదాం అంటూ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చింది బీఆర్ఎస్. మొత్తానికి అధికార కాంగ్రెస్ హయాంలో జరుగుతున్నది ఇదేనని బీఆర్ఎస్ చేసిన పోస్ట్ ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశం అవుతుంది.












Click it and Unblock the Notifications