Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కబ్జా.. తెలంగాణ భవన్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

భారత రాష్ట్ర సమితి (BRS) ప్రధాన పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ (Telangana Bhavan) ప్రభుత్వ విప్, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ మాటల్లో బేలతనం కనిపిస్తుందన్నారు. జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

సిరిసిల్ల జిల్లాలో పది ఎకరాల భూములు కబ్జా కాలేదని గుండెల మీద చేయి వేసుకుని చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేగాక, ఆక్రమించిన స్థలంలోనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కట్టారని ఆది శ్రీనివాస్ అన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఆక్రమించి కట్టిన భూమిని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలని, అర్హులకు చెందాల్సిన భూములు అక్రమంగా కబ్జా చేశారని ఆది శ్రీనివాస్ ఆరోపించారు.

Congress MLA Aadi Srinivas criticizes BRS for building Telangana Bhavan on occupied land

అక్రమంగా కబ్జా చేసిన 200 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నామన్నారు. గత ప్రభుత్వంలో పేదవాళ్లకు న్యాయం జరగలేదన్నారు. ఫార్ములా కేసులో ఏసీబీ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయన్నారు. గత ప్రభుత్వంలో అనేక టెలిఫోన్లను ట్యాపింగ్ చేసి అడ్డంకి దొరికిపోయారని విమర్శించారు. సాక్ష్యాలతో సహా పత్రికలు వార్తలు రాస్తే అవి కూడా అబద్ధం అని అంటున్నారని మండిపడ్డారు.

కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రిని మాటలంటున్నారని మండిపడ్డారు. మీరు పేర్లు రాసుకుని ఏం చేస్తారు..? రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఉండదని ఆది శ్రీనివాస్ జోస్యం చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ నడుచుకుంటే తాము గౌరవించేవాళ్లమన్నారు.

నిజమైన రైతులకే రైతుబంధు ఇస్తాున్నామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పులతో విధ్వంసం చేసి నాశానం చేశారని బీఆర్ఎస్ పాలనపై మండిపడ్డారు. 2 లక్షల రుణమాఫీని తప్పకుండా చేస్తామని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+