నన్నాపిన పాగల్ గాడెవడు? ట్రాఫిక్ ఏసీపీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జులుం!

తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల తీరుపైన గత కొంతకాలంగా బిఆర్ఎస్ వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అధికార కాంగ్రెస్ నేతలు ఎక్కడికక్కడ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్య పెట్టటం లేదని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

ట్రాఫిక్ ఏసీపీపై ఎమ్మెల్యే దుర్భాషలు
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలు మర్చిపోకముందే తాజాగా రామగుండం ట్రాఫిక్ ఏసిపిపై రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచితవ్యాఖ్యలు చేశారు. ఎన్ టి పి సి లో ప్రజాభిప్రాయల సేకరణ సభకు వెళుతున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వాహనాన్ని ఆ మార్గంలో వెళ్లొద్దని ట్రాఫిక్ ఏసిపి ఆపారు. దీంతో తన వాహనాన్ని ఆపిన ఆ పాగల్ గాడు ఎవడు అంటూ ఎమ్మెల్యే ఆగ్రహించారు.

Congress MLA makkan singh raj thakur abusive comments against Traffic ACP

ట్రాఫిక్ ఏసీపీపై దాడికి యత్నం
ట్రాఫిక్ ఏసిపి అయిన జాన్ నర్సింహులును ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తిట్టారు. పద్ధతిగా మాట్లాడాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేతో చెప్పే ప్రయత్నం చేసిన ట్రాఫిక్ ఏసిపిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగారు. ఇది మా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్యాంగం అంటూ ఆయనను నెట్టేస్తూ ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేశారు..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ఇక అక్కడ ఉన్న పోలీసులు ఎమ్మెల్యే పైన కేసు నమోదు చేసి అతనిపైన చర్యలకు ఉపక్రమించాల్సింది పోయి ఏసీపీకే గొడవ వద్దని సర్ది చెప్పారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రేవంత్ రెడ్డి రాజ్యంలో పోలీసులకే రక్షణ కరువైందని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.

అధికారులపై ఎమ్మెల్యే తీరు మంచిది కాదంటున్న ప్రజలు
అధికారులతో మాట్లాడేటప్పుడు ప్రజాప్రతినిధులు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందని ప్రజలు కూడా భావిస్తున్నారు. పవర్ లో ఉన్నామని అధికారులను నోటికి వచ్చినట్టు దుర్భాషలాడటం మంచిది కాదని హితవు పలుకుతున్నారు. ఏది ఏమైనా ఇటీవల కాలంలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల తీరు ముఖ్యంగా అధికారుల విషయంలో హాట్ టాపిక్ గా మారుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+