కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అల్టిమేటం..!!

తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీ నేతలంతా కలిసి కట్టుగా ఖమ్మం సభ సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ లో నేతల ఐక్యత ఇప్పుడు ప్రత్యేకార్షణగా మారింది. ఈ సభకు రాహుల్ గాంధీ వస్తుండటంతో నేతలంతా ఖమ్మం చేరుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం సభను అడ్డుకొనే ప్రయత్నం చేస్తుందనే ఆరోపణలు మొదలయ్యాయి. ఇదే అంశం పైన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసారు.

సభ నిర్వహణపైన ఆంక్షలు విధించటం పైన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం కరెక్ట్ కాదన్నారు. రాహుల్​ గాంధీ సభకు అడుగడుగునా ఆంక్షలు విధించడమేంటని నిలదీసారు. 4 నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేసారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు పోరాటాలు, సభలు, ధర్నాలు చేసుకునే హక్కు ఉందన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ సభకు రాత్రి నుంచి ఆంక్షలు పెట్టారు.. అక్రమ అరెస్టులు చేస్తున్నారని కోమటిరెడ్డి వివరించారు. ఆర్టీసీ వాహనాలను డబ్బులు కడతామన్నా ఇవ్వలేదన్నారు.ప్రైవేట్ వాహనాల్లో జనం సభకు వెళ్తుంటే అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

kotamreddyvenkatareddy

జనాన్ని కాంగ్రెస్ సభకు రాకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు న్యాయంగా డ్యూటీ చేయాలి.. సభా ప్రాంగణానికి 15, 20 కిలోమీటర్ల దూరంలో ఆపేయడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు. 35 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదని వివరించారు. కేసీఆర్ వెంటనే సభను సజావుగా సాగేందుకు పోలీసులకు సూచనలు చేయాలని డిమాండ్ చేసారు. లేదంటే జరిగే పరిణామాలకు మీదే బాధ్యత అంటూ కోమటిరెడ్డి అల్టిమేటం జారీ చేసారు. ఎక్కడ వాహనాలు ఆపితే అక్కడికి వేలాదిగా బైకులపై వెళ్తాం.. జనగర్జన జరిపి తీరుతాం.. ఏం జరిగినా మీదే బాధ్యత అంటూ కోమటిరెడ్డి తేల్చి చెప్పారు.

ఏదైనా జరగరానిది జరిగితే మాకేం సంబంధం లేదని వెంకటరెడ్డి స్పష్టం చేసారు. 9 ఏళ్లుగా కాంగ్రెస్ శ్రేణులను ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అయినా న్యాయపరంగా పోరాడుతున్నామే గానీ, హద్దు మీరలేదని చెప్పారు. కానీ, ఇప్పుడు లక్షలమంది సభకు వస్తుండడం చూసి ఓర్వలేక ఆంక్షలు విధిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే పోలీసులు ఇలా చేస్తున్నారని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+